Miryalaguda : బైకును ఢీకొన్న కారు మహిళ మృతి.. మరొకరికి గాయాలు..!
మిర్యాలగూడ మండలం వెంకటాద్రిపాలెం గ్రామ పరిధిలో రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. రూరల్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..

Miryalaguda : బైకును ఢీకొన్న కారు మహిళ మృతి.. మరొకరికి గాయాలు..!
మిర్యాలగూడ, మన సాక్షి:
మిర్యాలగూడ మండలం వెంకటాద్రిపాలెం గ్రామ పరిధిలో రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. రూరల్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మండలం లోని జప్తివీరప్పగూడెం… బుడ్డితండా, రాజేంద్రనగర్‌కు చెందిన ధనవత్ వెంకటేష్ (23) తనతో పాటు అదే గ్రామానికి చెందిన ధనవత్ లక్ష్మి (60)తో కలిసి హీరో స్ప్లెండర్ మోటార్ సైకిల్ మిర్యాలగూడ వైపు వెళ్తుండగా, వెంకటాద్రిపాలెం వద్దకు చేరుకున్న సమయంలో స్విఫ్ట్ కారు డ్రైవర్ నిర్లక్ష్యంగా, వేగంగా వాహనం నడుపుతూ మోటార్ సైకిల్‌ను ఢీకొట్టాడు.
ఈ ప్రమాదంలో వెనుక కూర్చున్న ధనవత్ లక్ష్మి తలకు తీవ్రమైన గాయాలు పొందగా, వెంటనే మిర్యాలగూడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అక్కడి నుండి పరిస్థితి విషమంగా ఉండటంతో మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్‌కు తరలిస్తుండగా మార్గమధ్యలో మరణించారు. ఈ ఘటనపై మిర్యాలగూడ రూరల్ సర్కిల్ ఇన్‌స్పెక్టర్ సంఘటనా స్థలాన్ని సందర్శించారు. ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి తెలిపారు.










