Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
Breaking Newsకరీంనగర్క్రైంజిల్లా వార్తలుతెలంగాణ

ఇసుక ట్రాక్టర్ ను వెంబడించిన పోలీసులు..? ట్రాక్టర్ బోల్తా, డ్రైవర్ మృతి..!

కరీంనగర్ జిల్లాలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. సోమవారం తెల్లవారుజామున కరీంనగర్ రూరల్ ఎస్సై నరేష్ పెట్రోలింగ్ డ్యూటీ చేస్తూ వాహనాలను తనిఖీ నిర్వహించాడు. తనిఖీలు చేస్తున్న క్రమంలో గోపాలపూర్ సమీపంలోని ప్రధాన రహదారిపై అక్రమంగా తరలిస్తున్న ఇసుక ట్రాక్టర్లను పట్టుకున్నారు.

ఇసుక ట్రాక్టర్ ను వెంబడించిన పోలీసులు..? ట్రాక్టర్ బోల్తా, డ్రైవర్ మృతి..!

న్యాయం కోసం కుటుంబ సభ్యుల ఆందోళన..

ఎస్సై ని సస్పెండ్ చేయాలనీ డిమాండ్

కరీంనగర్, మనసాక్షి :

కరీంనగర్ జిల్లాలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. సోమవారం తెల్లవారుజామున కరీంనగర్ రూరల్ ఎస్సై నరేష్ పెట్రోలింగ్ డ్యూటీ చేస్తూ వాహనాలను తనిఖీ నిర్వహించాడు. తనిఖీలు చేస్తున్న క్రమంలో గోపాలపూర్ సమీపంలోని ప్రధాన రహదారిపై అక్రమంగా తరలిస్తున్న ఇసుక ట్రాక్టర్లను పట్టుకున్నారు.

కాగా అటుగా ఇసుక లోడుతో వస్తున్న గుళ్ళపల్లి గ్రామానికి చెందిన ట్రాక్టర్ డ్రైవర్ గున్నాల హరీష్ (30) పోలీసులను చూసి తప్పించుకునేందుకు ప్రయత్నించగా.. ఎస్సై నరేష్ ట్రాక్టర్ ను వెంబడించగా లైట్స్ ఆఫ్ చేసి పంట పొలాల మీదుగా వెళ్లే క్రమంలో ట్రాక్టర్ బోల్తా పడి హరీష్ మృతి చెందినట్లు తోటి ట్రాక్టర్ డ్రైవర్లు, కుటుంబ సభ్యులు ఆరోపించారు.

అంతే కాకుండా హరీష్ మృతి చెందాకా కుటుంబ సభ్యులకు ఎలాంటి సమాచారం అందించకుండానే పోలీసులు కరీంనగర్లోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారన్నారు. దింతో పోలీసులపై ఆగ్రహానికి గురైన కుటుంబ సభ్యులు బంధువులతో కలసి ఆసుపత్రికి చేరుకుని పోలీసులను నిలదీశారు. తమకు సమాచారం ఇవ్వకుండా ఆసుపత్రికి ఎలా తీసుకొచ్చారని ప్రశ్నించారు. పోలీసులే చంపారంటు హరీష్ మృతిపై తమకు పలు అనుమానాలు ఉన్నాయన్నారు.

మృతికి ఎస్సై నరేష్ ఏ కారణమన్నారు. ఎస్సై పై చర్యలు తీసుకుని హరీష్ కుటుంబానికి న్యాయం చేయాలనీ డిమాండ్ చేస్తూ.. నగరంలోని మంచిర్యాల చౌరస్తాలో ధర్నాకు దిగి ఆందోళన చేపట్టారు. దింతో పోలీసులు ఆందోళనకారుల్ని అరెస్ట్ చేసి స్టేషన్ కి తరలించారు.

సమాచారం అందుకున్న పెద్దపల్లి మాజీ ఎమ్మెల్యే దాసారి మనోహర్ రెడ్డి బాధితుల పక్షాన నిలబడి ఈ ఘటనకు సంబందించిన కేసులో పూర్తి స్థాయిలో విచారణ జరిపి ఎస్సై పై కఠిన చర్యలు తీసుకుని సస్పెండ్ చేయాలనీ డిమాండ్ చేశారు. మృతుడు హరీష్ కు భార్య ఇద్దరు చిన్న పిల్లలు ఉన్నారని ప్రభుత్వం వారిని ఆదుకోవాలని ఆయన కోరారు.

మరిన్ని వార్తలు