శాలిగౌరారం ప్రాజెక్టు సదర్శించిన అధికారులు..!
నల్గొండ జిల్లాలోని మధ్యతరహా ప్రాజెక్టులలో ఒకటైన శాలిగౌరారం ప్రాజెక్ట్ ను అధికారులు సందర్శించారు.

శాలిగౌరారం ప్రాజెక్టు సదర్శించిన అధికారులు..!
శాలిగౌరారం, మనసాక్షి :
నల్గొండ జిల్లాలోని మధ్యతరహా ప్రాజెక్టులలో ఒకటైన శాలిగౌరారం ప్రాజెక్ట్ ను అధికారులు సందర్శించారు. ప్రాజెక్టులోకి నీరు వచ్చే “తుర్కపల్లి ప్రీడర్” ఛానల్ వద్ద షట్టర్లు లేకపోవడంతో ఎస్కేప్ వాటర్ మీరు మూసీ లోకి వృథా గా పోతున్న విషయాన్ని గ్రహించిన రైతు సంఘం ప్రతినిధి చామల వెంకటరమణ రెడ్డి పలుమార్లు తానే స్వయంగా రైతులతో నీరు సక్రమంగా వచ్చేందుకు తాత్కాలిక చర్యలకు దిగారు.
ఈ విషయం పట్ల ఇరిగేషన్ ఉన్నతాధికారులను పలుమార్లు కలిశారు.శాలిగౌరారం ప్రాజెక్టు పరిధిలోని రైతాంగం కోసం చామల వెంకటరమణ రెడ్డి చేస్తున్న కృషి పట్ల స్పందించిన ఇరిగేషన్ ఉన్నతాధికారులు శుక్రవారం శాలిగౌరారం ప్రాజెక్టు ను సందర్శించారు.
ఆయా సమస్యల పట్ల అధికారులు స్పందిస్తూ పల్లివాడ ఆనకట్టను,పల్లివాడ రాచకాలువ నుండి శాలిగౌరారం ప్రాజెక్టుకు నీరు వచ్చే షట్టర్ల ను రిపేర్ చేయిస్తామని హామీ ఇచ్చారు.ఈ కార్యక్రమంలో సి ఈ నాగభూషణం, ఎస్ ఈ శివధరమ్ తేజ్, ఈ ఈ సత్యనారాయణ,ఏ ఈ ఈ విక్రమ్ తదితరులు పాల్గొన్నారు.
ఎక్కువ మంది చదివినవి :
- TS News : తెలంగాణలో ఉపసర్పంచ్ లకు షాక్.. చెక్ పవర్ రద్దుకు సర్కార్ నిర్ణయం..!
- ఎరువుల దుకాణాలలో విజిలెన్స్, ఎన్ఫోరసెమెంట్ అధికారుల ఆకస్మిక తనిఖీలు..!
- Good News : తెలంగాణలో ఉపాధ్యాయులకు భారీ శుభవార్త.. విద్యాశాఖ గ్రీన్ సిగ్నల్..!
- మృగశిర కార్తెలో ఏ పంటలు సాగు చేయాలి.. ఏవి సాగు చేస్తే అధిక దిగుబడి వస్తుందంటే..!
- Ration Cards : రేషన్ కార్డుదారులకు శుభవార్త.. కొత్త పథకానికి ఆమోదం..!
- జీలుగ సాగుతో రైతుకు లాభాలెన్నో.. తెలుసుకోండి ఇలా..!










