Gold Price : బంగారం ధర మళ్ళీ పతనం.. కొనేవారికి పండగే.. ఈరోజు ఎంతంటే..!
బంగారం ధరలు నేలచూపులు చూస్తున్నాయి. మళ్లీ ధరలు తగ్గడంతో కొనుగోలుదారులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇటీవల ఐదు రోజులుగా ధరలు తగ్గుతూ వస్తున్నాయి.

Gold Price : బంగారం ధర మళ్ళీ పతనం.. కొనేవారికి పండగే.. ఈరోజు ఎంతంటే..!
మన సాక్షి, తెలంగాణ బ్యూరో :
బంగారం ధరలు నేలచూపులు చూస్తున్నాయి. మళ్లీ ధరలు తగ్గడంతో కొనుగోలుదారులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇటీవల ఐదు రోజులుగా ధరలు తగ్గుతూ వస్తున్నాయి.
సోమవారం ఒక్కరోజే 24 క్యారెట్స్ 100 గ్రాముల బంగారం ధర పదివేల 400 రూపాయలు తగ్గింది. 22 క్యారెట్స్ 100 గ్రాముల ధర 9500 తగ్గింది. అదేవిధంగా 10 గ్రాముల (తులం) బంగారం ధర 1040 రూపాయలు తగ్గగా 22 క్యారెట్స్ 10 గ్రాముల తులం బంగారం కు 950 రూపాయలు తగ్గింది.
నేడు తులం ఎంతంటే :
హైదరాబాద్ నగరంలో 10 గ్రాముల 24 క్యారెట్స్ బంగారం ధర 1,51,690 రూపాయలు ఉండగా 22 క్యారెట్స్ ధర ఒక లక్ష 30 వేల 50 రూపాయలుగా ఉంది. 18 క్యారెట్స్ 10 గ్రాముల తులం బంగారం ధర 1,13,770 ఉంది.
హైదరాబాద్ నగరం తో పాటు తెలుగు రాష్ట్రాల్లోనే ప్రధాన పట్టణాలైనా విజయవాడ, విశాఖపట్నం, తిరుపతి, వరంగల్, నిజామాబాద్, ఖమ్మం, నల్గొండ, కర్నూలు, రాజమండ్రి తదితర పట్టణాల్లో కూడా ఇవే వివిధ ధరలు కొనసాగుతున్నాయి.
MOST READ: