Breaking Newsక్రైంజిల్లా వార్తలుతెలంగాణనల్గొండ
మేడారం దర్శనానికి వెళ్తుండగా ప్రమాదం.. రావులపెంటలో తీవ్ర విషాదం..!
నర్సంపేట పట్టణంలోని ముత్తోజిపేట శివారులో బొలెరో వాహనం బోల్తా పడి నల్లగొండ జిల్లా వాసి మృతి చెందిన సంఘటన గురువారం తెల్లవారుజామున చోటు చేసుకుంది.

మేడారం దర్శనానికి వెళ్తుండగా ప్రమాదం.. రావులపెంటలో తీవ్ర విషాదం..!
నల్లగొండ/వేములపల్లి, మన సాక్షి:
నర్సంపేట పట్టణంలోని ముత్తోజిపేట శివారులో బొలెరో వాహనం బోల్తా పడి నల్లగొండ జిల్లా వాసి మృతి చెందిన సంఘటన గురువారం తెల్లవారుజామున చోటు చేసుకుంది. స్థానికుల కథనం ప్రకారం…
నల్లగొండ జిల్లా వేములపల్లి మండలం రావులపెంట గ్రామానికి చెందిన చీమల అంజయ్య (55) తన కుటుంబ సభ్యులతో కలిసి మేడారం సమ్మక్క సారక్క దర్శనానికి వెళుతుండగా.. ముత్తోజిపేట శివారులో బొలెరో వాహనం టైరు ఒక్కసారిగా పేలడంతో అదుపుతప్పి బోల్తా పడింది.ఈ ప్రమాదంలో అంజయ్య అక్కడికక్కడే మృతి చెందగా…
వారి కుటుంబ సభ్యులకు తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే స్థానికులు గాయపడిన వారిని ఓ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.ఈ ఘటన పై పోలీసులు కేసు నమోదు చేసుకున్న దర్యాప్తు చేపట్టారు.దీంతో గ్రామంలోని విషాదఛాయలు అల్లుకున్నాయి.









