సినిమాBreaking Newsజాతీయంహైదరాబాద్
దివంగత నటభూషణ్ శోభన్ బాబు ఇంట్లో విషాదం..!
దివంగత నటభూషణ్ శోభన్ బాబు ఇంట్లో విషాదం నెలకొన్నది. శోభన్ బాబు సతీమణి శాంత కుమారి కన్నుమూశారు. చెన్నైలోనే ఆమె కుటుంబ సభ్యులతో కలిసి నివసిస్తున్నారు. కాగా ఆమె అనారోగ్యం ద్వారా బాధపడుతూ తుది శ్వాస విడిచినట్లు కుటుంబ వర్గాలు వెల్లడించాయి.

దివంగత నటభూషణ్ శోభన్ బాబు ఇంట్లో విషాదం..!
మన సాక్షి, డెస్క్ :
దివంగత నటభూషణ్ శోభన్ బాబు ఇంట్లో విషాదం నెలకొన్నది. శోభన్ బాబు సతీమణి శాంత కుమారి కన్నుమూశారు. చెన్నైలోనే ఆమె కుటుంబ సభ్యులతో కలిసి నివసిస్తున్నారు. కాగా ఆమె అనారోగ్యం ద్వారా బాధపడుతూ తుది శ్వాస విడిచినట్లు కుటుంబ వర్గాలు వెల్లడించాయి.
ఆమె మరణ వార్త తెలిసిన వెంటనే సినీ అభిమానులు, ప్రముఖులు, శోభన్ బాబు అభిమానులు దిగ్భ్రాంతికి గురయ్యారు. శోభన్ బాబుకు శాంత కుమారితో 1958 మే 15వ తేదీన వివాహం జరిగింది. దశాబ్దాల ఆదర్శ దాంపత్య జీవితాన్ని గడిపిన దంపతులకు ముగ్గురు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నారు. శోభన్ బాబు సినీ జీవితంలో అత్యున్నత స్థాయికి చేరుకున్న సమయంలోనూ శాంతకుమారి ఎప్పుడు కుటుంబ బాధ్యతలు నిర్వహిస్తూ ఆయన వెంట నిలిచింది. తెలుగు సినీ చరిత్రలో అత్యంత ప్రజాదరణ పొందిన హీరోల్లో శోభన్ బాబు కూడా ఒకరుగా చిరస్థాయిగా నిలిచారు.
MOST READ :