Nalgonda : కరుణించని వరుణుడు.. పంటలు కాపాడుకునేందుకు పత్తి రైతులు సరికొత్త ప్రయోగం..!
వరుణుడు కరుణించడం లేదు. వర్షాలు పడటం లేదు. ఇటీవల కురిసిన కొద్దిపాటి వర్షాలకు రైతులు మాత్రం పత్తి చేలు వేసుకున్నారు. కానీ అవి ఎండిపోయే దశలో ఉన్నాయి. దాంతో నల్గొండ జిల్లా చింతపల్లి మండలంలో రైతులు సరికొత్త ప్రయోగం చేసి పంటలను కాపాడుకుంటున్నారు.

Nalgonda : కరుణించని వరుణుడు.. పంటలు కాపాడుకునేందుకు పత్తి రైతులు సరికొత్త ప్రయోగం..!
చింతపల్లి, మన సాక్షి :
వరుణుడు కరుణించడం లేదు. వర్షాలు పడటం లేదు. ఇటీవల కురిసిన కొద్దిపాటి వర్షాలకు రైతులు మాత్రం పత్తి చేలు వేసుకున్నారు. కానీ అవి ఎండిపోయే దశలో ఉన్నాయి. దాంతో నల్గొండ జిల్లా చింతపల్లి మండలంలో రైతులు సరికొత్త ప్రయోగం చేసి పంటలను కాపాడుకుంటున్నారు.
చింతపల్లి మండలంలో 34 గ్రామలలో 80 శాతం మంది రైతులు తమ పంట పొలాలలో లక్షలాది రూపాయల అప్పులు చేసి జూన్, జూలై మాసంలో పత్తి గింజలు నాటారు. ఏలి నో నో ప్రభావంతో సరిపడ వర్షం లేక లేటుగా నాటిన పత్తి గింజలు కొన్ని గ్రామాల్లోని రైతుల పొలాలలో గింజలు మొలకెత్తలేదు. దీంతో రైతులు తల పట్టుకుని వరుణ దేవుడు కోసం ఆకాశం వైపు ఎదురుచూస్తున్నారు తప్ప వరుణ దేవుడు కరుణించడం లేదని రైతులు తీవ్ర మనోవేద నకు గురవుతున్నారు.
నల్గొండ జిల్లా చింతపల్లి మండలంలోని కురుమేడు గ్రామం తో పాటు పలు గ్రామాల్లో బోరు మోటార్ల సహాయంతో స్పిన్క్లర్లను ఏర్పాటు చేసుకొని మొలసిన మొక్కను కాపాడుకుంటున్నా రు. అంతే కాకుండా రైతులు వర్షాలు కురుస్తాయని నమ్మకంతో యూరియా డిఎపి అడుగు మందులను కూడా పత్తిమొక్కలకు వేయించారు.
గత సంవత్సరం ఈ సమయానికి వేసిన పత్తి చేలు కొంత ఏపుగా పెరిగాయని రైతుల పేర్కొంటున్నారు. కొంతమంది రైతులు వర్షం సరిగా లేకపోవడంతో అప్పుచేసి తెచ్చిన మందులు చల్లకుండానే ఇళ్లల్లో భద్ర పరుచుకున్నారు. ఆగస్టు మాసం వస్తున్నప్పటికీ బోర్ల క్రింద బావుల క్రింద వరి నారు కూడా పోయలేదనిరైతులు వాపోతున్నారు.
నేటి వరకు బలమైన వర్షాలు కురవక పోవడంతో బోర్లు, బావు లు కూడా అడుగంటి పోయాయని రైతులు ఆవేదన వ్యక్తపరుస్తున్నారు. వర్షం పై ఏలినో నో చూపుతున్న ప్రభావంతో వ్యవసాయ శాఖ అధికారులు పలు సూచనలు అందజేస్తు ఆరుతడి పంటలపై రైతులు మక్కువ చూపించాలని మండలంలోని వివిధ గ్రామాల రైతులకు సూచనలు అందజేస్తున్నారు.
MOST READ :
- ట్రైనీ ఐపీఎస్ ఉదయ్ కృష్ణారెడ్డి ఆత్మహత్యయత్నానికి ముందు.. సోషల్ మీడియాలో పోస్ట్ చేసిందేమిటి..!
- పేకాట శిభిరంపై మెరుపు దాడి.. 7గురి అరెస్ట్..!
- Power Cut: పేటలో నేడు విద్యుత్ సరఫరా బంద్.. వేళలు ఇవే..!
- వరుణుడు కరుణించాలని.. భూలక్ష్మి దేవికి పూజలు..!
- Miryalaguda : తెలంగాణలో భూముల రీ-సర్వే.. పైలెట్ ప్రాజెక్ట్ లో ఎంపికైన గ్రామాల్లో అవగాహన..!










