Accident : కోదాడ సమీపంలో మిర్యాలగూడ డిపో బస్సును ఢీకొట్టిన లారీ..!
సూర్యాపేట జిల్లా చిలుకూరు మండలం సీతారాంపురం స్టేజీ వద్ద బుధవారం రోడ్డు ప్రమాదం జరిగింది. మిర్యాలగూడ డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు మిర్యాలగూడ నుంచి కోదాడ వైపు వెళ్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది.

Accident : కోదాడ సమీపంలో మిర్యాలగూడ డిపో బస్సును ఢీకొట్టిన లారీ..!
మన సాక్షి, సూర్యాపేట :
సూర్యాపేట జిల్లా చిలుకూరు మండలం సీతారాంపురం స్టేజీ వద్ద బుధవారం రోడ్డు ప్రమాదం జరిగింది. మిర్యాలగూడ డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు మిర్యాలగూడ నుంచి కోదాడ వైపు వెళ్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది. వివరాల ప్రకారం..
సీతారాంపురం స్టేజీ వద్ద బస్సులో ప్రయాణికులు ఎక్కుతుండగా వెనుక నుంచి అతివేగంతో వచ్చిన హుజూర్నగర్కు చెందిన పార్థసారథి ట్రాన్స్పోర్టు సిమెంట్ లారీ బస్సును బలంగా ఢీకొట్టింది. ఆ సమయంలో బస్సులో మొత్తం 68 మంది ప్రయాణికులు ఉన్నారు. లారీ బస్సును వెనుక నుంచి బలంగా ఢీకొట్టడంతో ప్రయాణికులు ఒక్కసారిగా భయాందోళనకు గురయ్యారు. ఈ ఘటనలో ఎనిమిది మంది ప్రయాణికులకు స్వల్ప గాయాలయ్యాయి.
సమాచారం అందుకున్న పోలీసులు, అధికారులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. ప్రమాద తీవ్రతను పరిశీలించిన సహాయక చర్యలను పర్యవేక్షించారు. ప్రయాణికులకు ప్రాణాపాయం తప్పడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
MOST READ :
- Miryalaguda : ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి కీలక సూచన.. రాష్ట్రంలోనే మిర్యాలగూడను ప్రథమ స్థానంలో నిలిపాలి..!
- Almatti : ఆల్మట్టిలోకి చేరుతున్న వరద.. 12,500 క్యూసెక్కుల నీరు దిగువకు విడుదల..!
- మహిళ ట్రైనీ ఐపీఎస్ పై లైంగిక వేధింపులు.. ట్రైనీ ఐపిఎస్ ఉదయ్ కృష్ణారెడ్డిపై కేసు నమోదు.. ఆత్మహత్యయత్నం..!
- Missing : హైదరాబాద్ మహానగరంలో భారీ సెన్సేషన్.. ముగ్గురు బాలికల అదృశ్యం..!









