పాఠశాలల్లో పండుగ వాతావరణం.. మెగా పేరెంట్ టీచర్స్ ఆత్మీయ సమావేశం..!
అన్నమయ్య జిల్లా ఈ మెగా పేరె ట్స్ టీచర్స్ ఆత్మీయ సమావేశంలో భాగంగా కేసీ పల్లె ఉన్నత పాఠశాలకు విచ్చేసిన ఎంపిపి రమణారెడ్డి కు విద్యార్థులు, తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు ఘనంగా స్వాగతం పలికారు

పాఠశాలల్లో పండుగ వాతావరణం.. మెగా పేరెంట్ టీచర్స్ ఆత్మీయ సమావేశం..!
ముఖ్యఅతిథిగా పాల్గొన్న ఎంపిపి రమణారెడ్డి
రామసముద్రం, మనసాక్షి :
అన్నమయ్య జిల్లా ఈ మెగా పేరె ట్స్ టీచర్స్ ఆత్మీయ సమావేశంలో భాగంగా కేసీ పల్లె ఉన్నత పాఠశాలకు విచ్చేసిన ఎంపిపి రమణారెడ్డి కు విద్యార్థులు, తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు ఘనంగా స్వాగతం పలికారు. పాఠశాల నివేదికను పాఠశాల ప్రధానోపాధ్యాయులు చదివి వినిపించారు.
పలుపాఠశాల ల్లో జరిగిన మెగా పేరెంట్స్ టీచర్స్ ఆత్మీయ సమావేశంలో
టిడిపి నాయకులు పాల్గొన్నారు.
వీరు మాట్లాడుతూ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న మెగా టీచర్ పేరెంట్స్ 4.0 విద్యార్థులు, తల్లిదండ్రులు, గురువుల మధ్య సత్సంబంధాలను మెరుగుపరుస్తుందని, పాఠశాలల అభివృద్ధికి దోహదం చేస్తుందని పేర్కొన్నారు.
హోలిస్టిక్ ప్రోగ్రెస్ కార్డుల ఉపయోగం గురించి తల్లిదండ్రులకు తెలిపారు.
ప్రతి పిల్లవాడి అభ్యాస పురోగతిని పర్యవేక్షించాలని తల్లిదండ్రులకు సూచించారు. ఉపాధ్యాయ–తల్లిదండ్రుల సమన్వయంతో విద్యా నాణ్యత మెరుగుపరచాలని పాఠశాల అభివృద్ధి, మౌలిక వసతులపై తల్లిదండ్రుల సూచనలు సేకరణ ఏపీ ప్రభుత్వం అందిస్తున్న ప్రోత్సాహం, సంక్షేమ పథకాలను అందిపుచ్చుకొని పిల్లలను బాగా చదివించి ఉన్నత శిఖరం అందుకునేలా ప్రోత్సహించాలని తల్లిదండ్రులకు సూచించిన ఎంపిపి రమణారెడ్డి.
అంతకుముందు తల్లిదండ్రులకు ఏపీ ఆదర్శ పాఠశాల పలు పాఠశాలలల్లో టగ్గాఫ్ వార్, మ్యూజికల్ చైర్స్, ముగ్గుల పోటీలు నిర్వహించారు.ముగ్గుల పోటీల్లో పాల్గొని గెలుపొందిన వారికి బహుమతులు ప్రధానం చేశారు.
ఈ కార్యక్రమంలో టిడిపి సీనియర్ నాయకులు రైస్ మిల్ వెంకటరమణా రెడ్డి, మాలమహా నాడు అధ్యక్షులు, స్కూల్ చైర్మన్ టి. కృష్ణప్ప,కాప్పల్లె గ్రామ పంచాయతీ టిడిపి నాయకులు లోకరాజు చెంబకూరు రాంమూర్తి, బాలాజీ, దొరబాబు ఏపీ మోడల్ స్కూల్ ప్రిన్సిపాల్ మునిస్వామి నాయక్, జూనియర్ కాలేజీ ప్రిన్సిపాల్ చిట్టి బాబు, హెచ్ ఎం లు చిట్టిబాబు, వెంకటాచలపతి రాజు,
వెంకటరమణ నాయుడు కె. రమేష్,కృష్ణమూర్తి, వెంకటరమణ, సుబ్బారెడ్డి, జి. రామన్న, గణేష్, లక్ష్మి శాంతి, ఉమామహేశ్వరీ, సి ఆర్ పి సందురి దామోదర్ ఎస్టీ సెల్ ఈశ్వర్,పాఠశాల ఉపాధ్యాయిని, ఉపాధ్యాయులు, విద్యార్థులు, తల్లిదండ్రులు, పూర్వపు విద్యార్థులు, పాఠశాల కమిటీ అధ్యక్షులు సభ్యులు, అధికారులు స్థానిక ప్రజాప్రతినిధులు, తదితరులు పాల్గొన్నారు.











