Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
Breaking Newsకరీంనగర్జిల్లా వార్తలురాజకీయం

Karimnagar : అంబేద్కర్‌ను విమర్శించే ముందు చరిత్ర చదవండి..!

భారత రాజ్యాంగ నిర్మాత, భారతరత్న డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్‌ను ‘కల్పిత నాయకుడు’గా పేర్కొంటూ హమారా ప్రసాద్ పుస్తకం రాసిన అంశాన్ని తెలంగాణ అంబేద్కర్ యువజన సంఘం కరీంనగర్ జిల్లా అధ్యక్షుడు క్యాదాసి ప్రభాకర్ తీవ్రంగా ఖండించారు.

Karimnagar : అంబేద్కర్‌ను విమర్శించే ముందు చరిత్ర చదవండి..!

కరీంనగర్ బ్యూరో, మనసాక్షి :

భారత రాజ్యాంగ నిర్మాత, భారతరత్న డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్‌ను ‘కల్పిత నాయకుడు’గా పేర్కొంటూ హమారా ప్రసాద్ పుస్తకం రాసిన అంశాన్ని తెలంగాణ అంబేద్కర్ యువజన సంఘం కరీంనగర్ జిల్లా అధ్యక్షుడు క్యాదాసి ప్రభాకర్ తీవ్రంగా ఖండించారు. కరీంనగర్ కోర్టు చౌరస్తాలోని అంబేద్కర్ కూడలిలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు.

ALSO READరైస్ మిల్లులో విజిలెన్స్ సోదాలు.. 6 వేల 26 బస్తాలు మాయం..!

అంబేద్కర్‌ కృషిని ఒక పుస్తకంలోని వ్యాఖ్యలతో మార్చలేమని, భారత రాజ్యాంగ రూపకల్పనలో అంబేద్కర్ కీలక పాత్ర పోషించారన్నది చారిత్రకంగా నమోదైన విషయమని పేర్కొన్నారు. రాజ్యాంగం, ప్రాథమిక హక్కులు, సామాజిక న్యాయం వంటి అంశాలపై అంబేద్కర్ ఆలోచనలు దేశవ్యాప్తంగా ప్రభావం చూపాయని తెలిపారు. 2016లో ఐక్యరాజ్యసమితి న్యూయార్క్ ప్రధాన కార్యాలయంలో అంబేద్కర్ 125వ జయంతి సందర్భంగా ప్రత్యేక కార్యక్రమం నిర్వహించడాన్ని ఆయన ప్రస్తావించారు. అంబేద్కర్‌ను విమర్శించే ముందు ఆయన రచనలు, ఆలోచనలు, సామాజిక సంస్కరణలపై అధ్యయనం చేయాలని ప్రభాకర్ సూచించారు.

ALSO READవినాయక నిమజ్జనంలో తీవ్ర విషాదం.. ఆరుగురు మృతి..! 

అంబేద్కర్‌పై చేసిన వ్యాఖ్యలను ఉపసంహరించుకుని దళిత సమాజానికి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు సుద్దాల లక్ష్మిన్, సముద్రాల అజయ్, రాష్ట్ర కార్యదర్శులు గోస్కి శంకర్, మామిడిపల్లి కృష్ణ, మహిళా అధ్యక్షురాలు కొండ్రా స్వరూప, జిల్లా ప్రధాన కార్యదర్శులు మైసని మనోహర్, చామనపల్లి శేఖర్, జిల్లా ఉపాధ్యక్షులు నిరుకుల్లా అనిల్, తప్పట్ల అంజయ్య, నగర అధ్యక్షుడు నక్క అన్వేష్, నగర ప్రధాన కార్యదర్శి మల్యాల కిరణ్, అధికార ప్రతినిధి గడ్డం నాగరాజు, సీనియర్ నాయకులు ఎర్రోళ్ల మల్లేశం, గజ్జల కృష్ణమురళి, వీరనాథ్ తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు