UPI : యూపీఐ పేమెంట్స్ కు అలా చేస్తే చార్జీలు చెల్లించాల్సిన అవసరం లేదు..!
యూపీఐ చెల్లింపులపై ప్రభుత్వం ఎం డి ఆర్ చార్జీలు వసూలు చేయనున్నారు. అయితే యూపీఐ లావాదేవీలకు మర్చంట్ డిస్కౌంట్ రేట్ (ఎండిఆర్) విధానం వర్తిస్తుంది.

UPI : యూపీఐ పేమెంట్స్ కు అలా చేస్తే చార్జీలు చెల్లించాల్సిన అవసరం లేదు..!
మన సాక్షి, వెబ్ డెస్క్:
యూపీఐ చెల్లింపులపై ప్రభుత్వం ఎం డి ఆర్ చార్జీలు వసూలు చేయనున్నారు. అయితే యూపీఐ లావాదేవీలకు మర్చంట్ డిస్కౌంట్ రేట్ (ఎండిఆర్) విధానం వర్తిస్తుంది. ఎం డి ఆర్ చార్జీలు ఎంపిక చేసిన వ్యాపారి లావాదేవీలకు మాత్రమే వర్తించనున్నాయి. కొన్నింటికి ఎండిఆర్ చార్జీల నుంచి మినహాయింపు ఇచ్చారు. అవి ఏంటో పరిశీలిద్దాం..
1. వ్యక్తి నుంచి వ్యక్తికి చేసే యూపీఐ పేమెంట్ (P2P) లపై ఎలాంటి చార్జీలు ఉండవు. దాంతో కుటుంబ సభ్యులు, స్నేహితులు నేరుగా ఎలాంటి చార్జీలు చెల్లించకుండా యూపీఐ లావాదేవీలు చేసుకోవచ్చును.
2. అదేవిధంగా యూపీఐ ద్వారా మీ బ్యాంకు ఖాతాకు నిధులను స్వీకరించడం వల్ల కూడా ఎలాంటి చార్జీలు ఉండవు.
3. వీధి వ్యాపారులతో సహా చిన్న వ్యాపారులు పర్సన్ టు పర్సన్ మర్చంట్ (P2PM) వర్గం కిందికి యూపిఐ క్యూఆర్ కోడ్ ద్వారా నెలకు 1 లక్ష రూపాయల వరకు స్వీకరించే లావాదేవీలపై చార్జీలు ఉండవు.
3. 2000 రూపాయల వరకు జరిగే అన్ని పర్సన్ టు మర్చంట్ (P2M) లావాదేవీలకు చార్జీలు మినహాయింపు ఉంటుంది.
4. సాధారణంగా వ్యాపారుల వద్ద 2000 రూపాయల లోపు వస్తువులను కొనడం ఉచితంగానే ఉంటుంది.
5. 2000 రూపాయలు దాటితే 0.4% రుసుమును వ్యాపార సంస్థ చెల్లించాల్సి ఉంటుంది.
6. ఆటో పే లేదా బిల్లు చెల్లింపులకు సెటప్ చేయడం చార్జీలు ఉండవు.
7. ఓటీటి లు, ఇతర బిల్లులు ఆటో పెట్టుకుంటే వాటికి కూడా చార్జీలు వర్తించవు.
8. రైల్వేలు, టెలికమ్యూనికేషన్స్, భీమా రంగం, ఇంధనం, వ్యవసాయ సంబంధిత వనరులకు అత్యవసర తక్కువ లాభాల మార్జిన్ ఉన్న రంగాలలో 2000 రూపాయల లోపు లావాదేవీలు జరిగితే మాత్రం చార్జీలు వర్తించవు.
9. వ్యాపారస్తులు MDR చార్జీలను వినియోగదారులపై వేయకుండా చూసుకోవాలని బ్యాంకులకు ప్రభుత్వం సూచించింది.
SIMILAR NEWS :









