Breaking Newsజిల్లా వార్తలుతెలంగాణవైద్యంహైదరాబాద్
NIMS : నిమ్స్ ఆసుపత్రిలో ఏసీబీ అధికారుల సోదాలు..!
హైదరాబాద్ లోని నిమ్స్ ఆసుపత్రిలో ఏసీబీ అధికారులు మంగళవారం ఉదయం నుంచి సోదాలు చేపడుతున్నారు. ఆసుపత్రిలోని అడిషనల్ సూపర్డెంట్ గా పని చేస్తున్న డాక్టర్ లక్ష్మి భాస్కర్ ఆదాయానికి మించిన ఆశలు కలిగి ఉన్నారని ఆరోపణల నేపథ్యంలో ఈ దాడులు నిర్వహిస్తున్నారు.

NIMS : నిమ్స్ ఆసుపత్రిలో ఏసీబీ అధికారుల సోదాలు..!
మన సాక్షి, వెబ్ డెస్క్:
హైదరాబాద్ లోని నిమ్స్ ఆసుపత్రిలో ఏసీబీ అధికారులు మంగళవారం ఉదయం నుంచి సోదాలు చేపడుతున్నారు. ఆసుపత్రిలోని అడిషనల్ సూపర్డెంట్ గా పని చేస్తున్న డాక్టర్ లక్ష్మి భాస్కర్ ఆదాయానికి మించిన ఆశలు కలిగి ఉన్నారని ఆరోపణల నేపథ్యంలో ఈ దాడులు నిర్వహిస్తున్నారు. ఏకకాలంలో మూడు జిల్లాల్లోని 12 చోట్ల ఏసి బాధికారులు సోదాలు నిర్వహిస్తున్నట్లు తెలుస్తోంది.
డాక్టర్ లక్ష్మీ భాస్కర్ నివాసం, కార్యాలయం, అదేవిధంగా బంధువులు, సన్నిహితుల ఇండ్లలో కూడా సోదాలు నిర్వహిస్తున్నట్లు సమాచారం. అతనిపై వచ్చిన ఆరోపణల విషయంలో ఎసిబి అధికారులు సమాచారం సేకరించి.. ఈ దాడులు చేపడుతున్నట్లు తెలుస్తుంది.
MOST READ :









