Miryalaguda : బియ్యం ధరలపై రైస్ మిల్లర్లకు జిల్లా కలెక్టర్ కీలక ఆదేశం..!
ఎల్ నినో పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని రైస్ మిల్లర్లు బియ్యం ఎక్కువ ధరకు అమ్మకుండా తగ్గించి అమ్మాలని జిల్లా కలెక్టర్ బి. చంద్రశేఖర్ కోరారు.

Miryalaguda : బియ్యం ధరలపై రైస్ మిల్లర్లకు జిల్లా కలెక్టర్ కీలక ఆదేశం..!
మిర్యాలగూడ, మన సాక్షి :
ఎల్ నినో పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని రైస్ మిల్లర్లు బియ్యం ఎక్కువ ధరకు అమ్మకుండా తగ్గించి అమ్మాలని జిల్లా కలెక్టర్ బి. చంద్రశేఖర్ కోరారు.
శుక్రవారం అయన నల్గొండ జిల్లా, మిర్యాలగూడ సమీపంలోని దాక్షాయిని పారా బాయిల్డ్ రైస్ మిల్లును ఆకస్మికంగా తనిఖీ చేశారు.
మిల్లులో బియ్యం మర ఆడించడం, ప్యాకింగ్ , ట్రాన్స్పోర్ట్ , తదితర వివరాలను పరిశీలిస్తూ మిర్యాలగూడ రైస్ మిల్లర్స్ సంఘం అధ్యక్షుడు గౌరు శ్రీనివాస్, సెక్రటరీ బాబి, కోశాధికారి గందే రాము, మిల్ ఓనర్లు జేవి రమణ, తిరుపతిరావులతో మాట్లాడుతూ ఎల్ నీనో కారణంగా ప్రజలు తీవ్ర ఇబ్బందుల్లో ఉన్నారని, అందువల్ల బియ్యం ఎక్కువ ధరలకు అమ్మకుండా ధరను తగ్గించి అమ్మాలని కోరారు.
అలాగే నాణ్యమైన బియ్యం మార్కెట్లో ఉండేలా చూడాలని , బియ్యం హోల్ సేల్ ,రిటైల్ అమ్మకం దారులకు కూడా ఈ విషయాన్ని తెలియజేయాలని ఆయన కోరారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ బియ్యం బస్తాల బరువు, ఖాళీ బస్తాలు, లేబుళ్లు, ప్యాకింగ్,ధర లను పరిశీలించారు.
రెవెన్యూ అదనపు కలెక్టర్ జే. శ్రీనివాస్, మిర్యాలగూడ ఆర్డీవో రమణారెడ్డి, డిఎస్ఓ వెంకటేష్, పౌరసరఫరాల జిల్లా మేనేజర్ రాంపతి నాయక్, తదితరులు కలెక్టర్ వెంట ఉన్నారు.










