Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
Breaking Newsక్రైంజిల్లా వార్తలుతెలంగాణహైదరాబాద్

Long Drive : లాంగ్ డ్రైవ్ పేరుతో సరి కొత్త మోసం..!

Long Drive : లాంగ్ డ్రైవ్ పేరుతో సరి కొత్త మోసం..!

శేరిలింగంపల్లి, మన సాక్షి

లాంగ్ డ్రైవ్ పేరుతో కార్లను అద్దెకు తీసుకొని అమ్ముకుంటున్నా ముఠాను మాదాపూర్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ ఘటనకు సంబంధించిన వివరాలను మాదాపూర్ ఏసీపీ సీహెచ్.శ్రీకాంత్ విలేకరుల సమావేశంలో వివరించారు.

ఆదిలాబాద్ జిల్లా రామగుండంకు చెందిన హరీష్ కుమార్ కుందారపు, మడెల్ల అభిషేక్, ఎల్కపల్లి కోమలేశ్వర్, ఏలూరి ప్రేమ్ కుమార్ ముఠాగా ఏర్పడి లాంగ్ డ్రైవ్ కార్లను లీజుకు తీసుకుని వాటిని తాకట్టుపెట్టడం లేదా అమ్మేయటం చేస్తున్నారు. వీరిలో ప్రధాన నిందితుడైన హరీష్ కుమార్ లాంగ్ డ్రైవ్ కార్లను బుక్ చేస్తాడు. మిగతా ముగ్గురు నిందితులు మడెల్ల అభిషేక్, ఎల్కపల్లి కోమలేశ్వర్, ఏలూరి ప్రేమ్ కుమార్​లను ఆయా అద్దె కార్ల యజమానుల వద్దకు పంపి నకిలీ ధ్రువపత్రాలు సమర్పించి కార్లను అద్దెకు తీసుకుంటారు.

వాటిని తీసుకువచ్చి ప్రధాన నిందితుడైన హరీష్ కుమార్ కు అప్పగిస్తారు. అతను వారి వద్ద నుండి కార్లను తీసుకుని ముగ్గురికి ఒక్కోరికి రూ.35 వేల నుండి రూ.50 వేల వరకు కమీషన్ ఇస్తాడు. ఆ తర్వాత నిందితుడు హరీష్ ఆ కార్లను ఆదిలాబాద్‌కు తీసుకెళ్లి తనకు అత్యవసరంగా డబ్బులు అవసరం ఉన్నాయని చెబుతూ ఆ కార్లను గుర్తు తెలియని వ్యక్తుల వద్ద తాకట్టు పెడతాడు. వారు ఒరిజినల్ వాహన పత్రాలను అడిగినప్పుడు, అతను ప్రస్తుతం తన వద్ద పై పత్రాలు లేవని వారిని నమ్మించేలా చేస్తాడు. అవసరం అయితే వాటిని తరువాత ఇస్తానని వారికి హామీ ఇస్తాడు.
ఈ విధంగా ప్రధాన సూత్రధారి ఒక్కో కారుకు రూ.4 లక్షల నుండి రూ. 5 లక్షల వరకు డబ్బులు తీసుకుంటాడు. వచ్చిన డబ్బుతో హరీష్ విలాసవంతమైన జీవితం గడుపుతున్నాడు. ఇప్పటి వరకు పై నలుగురు నిందితులు మాదాపూర్ లాంగ్ డ్రైవ్ కార్ల నుండి పలు కార్లను తీసుకొని విక్రయించారు.

వీటి విలువ సుమారు కోటి రూపాయలు ఉంటుందని ఏసీపీ తెలిపారు. బాధితుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు పక్కా సమాచారంతో నిందితులను అరెస్ట్ చేశారు. అలాగే కార్లను స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసును చేధించిన పోలీసులను ఏసీపీ శ్రీకాంత్ అభినందించారు. ఈ సమావేశంలో మాదాపూర్ సీఐ మల్లేష్, ఎస్సై వెంకటేశ్వర్లు, కానిస్టేబుళ్లు పాల్గొన్నారు.

ALSO READ : 

మరిన్ని వార్తలు