Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
Breaking Newsజిల్లా వార్తలుతెలంగాణరంగారెడ్డివిద్య

Madgula : నాగిళ్ల వాసికి అరుదైన గౌరవం..!

Madgula : నాగిళ్ల వాసికి అరుదైన గౌరవం..!

డాక్టరేట్ పొందిన బర్కం యాదయ్య

హర్షం వ్యక్తం చేసిన గ్రామస్తులు

రంగారెడ్డి జిల్లా, మాడ్గుల, మన సాక్షి :

రంగారెడ్డి జిల్లా మాడ్గుల మండలం నాగిళ్ల గ్రామానికి చెందిన బర్కం యాదయ్యకు అరుదైన డాక్టరేట్ అవార్డు లభించింది. మండలంలోని నాగిళ్ల గ్రామంలో నిరుపేద కుటుంబంలో జన్మించిన బర్కం యాదయ్య చిన్ననాటి నుండి ఎంతో కష్టపడి ప్రభుత్వ పాఠశాలలో విద్యనభ్యసించి అంచలంచెలుగా ఎదుగుతూ హైదరాబాదులోని ఉస్మానియా విశ్వవిద్యాలయంలో పి హెచ్ డి విద్యాభ్యాసం చేసి తనకు ఇష్టమైన కోర్సులో చక్కని ప్రతిభను చాటి డాక్టరేట్ అవార్డుకు ఎంపికయ్యారు.

ఉస్మానియా విశ్వవిద్యాలయంలో కామర్స్ విభాగంలో భారత దేశ ఫార్మా కంపెనీల పనితీరు – మదింపు పైన ప్రొఫెసర్ వి. అప్పారావు పర్యవేక్షణలో యాదయ్య రీసెర్చ్ పూర్తి చేశారు. ఈ విభాగంలో అత్యంత ప్రతిభ కనబరిచిన యాదయ్యకు డాక్టరేట్ అవార్డు లభించింది. డాక్టరేట్ పట్టా పొందిన బర్కం యాదయ్య నాగిళ్ల గ్రామంలో మొదటి వ్యక్తి కావడంతో రంగారెడ్డి జిల్లాలోని విద్యావంతులతో పాటు స్వంత గ్రామమైన నాగిళ్ల గ్రామ ప్రజలు అభినందనలు తెలిపారు.

ALSO READ : 

Digital Voter Card : ఆన్ లైన్ లో డిజిటల్ ఓటర్ కార్డ్ సింపుల్ గా డౌన్ లోడ్ చేసుకోవచ్చు.. ఇలా చేయండి..!

Breaking News : తెలంగాణ రైతులకు గుడ్ న్యూస్.. వారి ఎకౌంట్ల లోకి పదివేల రూపాయలు..!

WhatsApp : ఇండియాలో వాట్సాప్ సేవలు నిలిచిపోనున్నాయా.. కారణం ఏంటి..?

మరిన్ని వార్తలు