Nalgonda : మైనర్ బాలికను అత్యాచారం చేసిన కేసులో సంచలనమైన తీర్పు..!
Nalgonda : మైనర్ బాలికను అత్యాచారం చేసిన కేసులో సంచలనమైన తీర్పు..!
నల్లగొండ, మన సాక్షి :
నల్గొండ జిల్లా నార్కట్ పల్లి మండల పరిధికి చెందిన వలిగొండ వెంకన్న , కట్టంగూర్ మండలానికి చెందిన ఒక మైనర్ బాలికను పెళ్లి చేసుకుంటానని నమ్మించి గర్భవతి చేసి మోసం చేసిన కేసులో నిందితుడుకి ఎస్సీ ఎస్టీ కోర్టు అదనపు జడ్జి నిందితునికి 21 సంవత్సరాల జైలు, 30 వేల జరిమాన. 10 లక్షల పరిహారం ఇవ్వాలని తీర్పునివ్వడం జరిగిందని జిల్లా ఎస్పి శరత్చంద్ర పవర్ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు.
2018 వ సంవత్సరంలో నిందితుడు నార్కట్ పల్లి మండలానికి చెందిన వాడపల్లి వెంకన్న, కట్టంగూర్ మండలానికి చెందిన ఒక మైనర్ బాలికను పరిచయం చేసుకొని మాయమాటలు చెప్పి పెళ్లి చేసుకుంటానని నమ్మించి శారీరకంగా వాడుకొని గర్భవతి చేసిన తర్వాత పెళ్ళి చేసుకొననీ మోసం చేయడంతో
బాధితురాలు పిర్యాదు మేరకు కట్టంగూర్ పోలీస్ స్టేషన్ లో 20 ఏప్రిల్, 2018 లో నిందితుని పై కేసు నమోదు చేసి కోర్ట్ లో ఛార్జ్ సీట్ దాఖలు సమర్పించగా వాదోపవాదాల అనంతరం గురువారం నిందితునికి మొత్తం 21 సంవత్సరాలు జైలు 30000/- జరిమాన, బాధితురాలికి 10,00,000/-(పది లక్షల రూపాయలు) పోక్సో చట్టం-2012 సెక్షన్ 3 ద్వారా పరిహారం త్వరితగతిన చెల్లింపును చేయాలని ఆదేశించిందని తెలిపారు.
ఈ కేసులో సరిఅయిన ఆధారాలు సేకరించి కోర్టులో ఛార్జ్ షీట్ దాఖలు సమర్పించి నిందితునికి శిక్ష పడే విధంగా చేసిన అప్పటి ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్స్,యస్.ఐ బి.రంజిత్, సీఐ క్యాస్ట్రో, ప్రస్తుతం శాలిగౌరారం సీఐ కొండల్ రెడ్డి,యస్. ఐ రవీందర్ కట్టింగూర్ పీఎస్ ప్ పివేముల రంజిత్ కుమార్, సిడిఓ రువ్వా నాగరాజు, భరోసా లీగల్ ఆఫీసర్ కల్పన, లైజన్ అధికారులు, నరేందర్, మల్లికార్జున్, జిల్లా ఎస్పీ అభినందించారు.
MOST READ :
-
Nalgonda : సాగునీటి కోసం.. రైతుల ధర్నా.. రాస్తారోకో..!
-
Viral Video : వెరీ బ్రిలియంట్ టీచర్.. నెలకు రూ.70 వేల జీతం.. ELEVEN ఎలా రాశాడో తెలుసా.. (వీడియో)
-
District collector : ఇంత నిర్లక్ష్యమా.. వైద్యులపై జిల్లా కలెక్టర్ సీరియస్..!
-
Job Mela : నిరుద్యోగులకు భారీ శుభవార్త.. పదవ తరగతి ఆపై అర్హతల వారికి మెగా జాబ్ మేళా..!
-
Spot Admissions : ఇంటర్ కంప్యూటర్ సైన్స్ గ్రూపులో స్పాట్ అడ్మిషన్స్ కు దరఖాస్తుల స్వీకరణ..!

