Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
Breaking NewsUncategorizedజిల్లా వార్తలుతెలంగాణనల్గొండరాజకీయం

BJP : కిషన్ రెడ్డి సమక్షంలో బిజెపిలో చేరిన పిల్లి రామరాజు యాదవ్..!

BJP : కిషన్ రెడ్డి సమక్షంలో బిజెపిలో చేరిన పిల్లి రామరాజు యాదవ్..!

నల్లగొండ నుండి భారీ ర్యాలీతో తరలి వెళ్లిన పిల్లి రామరాజు యాదవ్.

నల్లగొండ, ఏప్రిల్ 9, మనసాక్షి.

నలగొండ నియోజకవర్గం నుండి ఫార్వర్డ్ బ్లాక్ ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసి దాదాపు 30 వేల ఓట్లు సంపాదించిన 8వ వార్డు కౌన్సిలర్ మాజీ బి ఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడుపిల్లి రామరాజు యాదవ్ మంగళవారం నల్లగొండ నుండి భారీ కాన్వాయ్ తో హైదరాబాద్ వెళ్లి కేంద్ర మంత్రి రాష్ట్ర బిజెపి అధ్యక్షుడు కిషన్ రెడ్డి సమక్షంలో బిజెపిలో చేరారు.

ఈ సందర్భంగా కిషన్ రెడ్డి పిల్లి రామరాజు యాదవ్ కు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా కిషన్ రెడ్డి మాట్లాడుతూ నల్లగొండ పార్లమెంట్ అభ్యర్థి సైదిరెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. పిల్లి రామరాజు చేరిక వలన బిజెపి నల్గొండ జిల్లాలో బలపడుతుందని అన్నారు. ప్రధానమంత్రి మోడీ మూడవసారి కూడా ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేస్తారని అందులో ఎటువంటి అనుమానం లేదని అన్నారు.

ఈ సందర్భంగా పిల్లి రామరాజు యాదవ్ మాట్లాడుతూ తను స్వార్థం కోసం పార్టీ మారడం లేదని ప్రజల అభీష్టం మేరకే నిర్ణయం తీసుకున్నాను అన్నారు. కాంగ్రెస్ పార్టీ ఆరు గ్యారంటీ లు అమలు చేయడం లేదని ప్రజలు బిజెపి వైపు చూస్తున్నారన్నారు. ఒక అహంకార ప్రభుత్వాన్ని గద్దదించార
ని మరో అబద్ధాల ప్రభుత్వాన్ని పారదోలాల అన్నారు.

దేశంలో ప్రధానమంత్రి మోడీ చేస్తున్న అభివృద్ధి సంక్షేమ పథకాలకు ప్రజల స్పందన బాగుందని. అనేక గ్రామాలలో పార్లమెంట్ ఎన్నికలను మోడీ ఎన్నికలనీ ప్రజలు మోడీని అభిమానిస్తూ రాబోయే ఎన్నికలలో మోడీ కే ఓటు వేస్తామని చెప్పుకుంటున్నారని తెలిపారు. దేశం కోసం పనిచేసే ఏకైక పార్టీ బిజెపి అన్నారు. రాష్ట్రంలో 17 పార్లమెంట్ సీట్లను బిజెపి గెలుచుకుంటుందన్నారు.

నల్గొండ మున్సిపాలిటీని దక్కించుకోవడమే తన లక్ష్యమన్నారు. ఈ కార్యక్రమంలో రాజ్యసభ సభ్యులు ఓబీసీ జాతీయ చైర్మన్ లక్ష్మణ్. బిజెపి నల్గొండ పార్లమెంట్ అభ్యర్థి సైదిరెడ్డి బిజెపి రాష్ట్ర కార్యదర్శి మాదగోని శ్రీనివాస్ గౌడ్, బిజెపి జిల్లా అధ్యక్షులు డాక్టర్ వర్షిత్ రెడ్డి, బిజెపి నాయకులు సాంబయ్య, పిల్లి రామరాజు అభిమానులు తదితరులు పాల్గొన్నారు.

ALSO READ : 

మరిన్ని వార్తలు