ములుగు : తహసిల్దార్ కార్యాలయం ముట్టడించిన ఆదివాసీలు

ములుగు : తహసిల్దార్ కార్యాలయం ముట్టడించిన ఆదివాసీలు

వెంకటాపురం , మనసాక్షి

ములుగుజిల్లా వెంకటాపురం మండలం.తెలంగాణ ఏర్పడ్డ తర్వాత పోడు సాగుదారుల సమస్యలను సవరిస్తానని,2014 జూన్ రెండు నాటికీ సాగులో ఉన్న ప్రతి ఒక్కరికి పోడు పట్టాలు ఇస్తామని చెప్పిన కెసిఆర్ హామీలు బూడిదలో పోసిన పన్నీర్ లా అయ్యాయని ఆదివాసీ నవనిర్మాణ సేన వ్యవస్థాపక రాష్ట్ర అధ్యక్షులు, బర్లగూడెం సర్పంచి కొర్స. నర్సింహామూర్తి విమర్శించారు.

 

కెసిఆర్ మాటలు నీటిమీద రాతలే అని అన్నారు.ఆదివాసీ నవనిర్మాణ సేన ఆధ్వర్యంలో రెండు మండలాలకు చెందిన పోడు రైతులు.పోడు పట్టాలు ఇవ్వాలని సోమవారం ప్రధాన రహదారిపైన పెద్దఎత్తున నినాదాలుచేస్తూ భారీర్యాలీ నిర్వహించారు.కొమరంభీమ్ విగ్రహానికి పూలమాలవేసి ర్యాలీగావచ్చి అనంతరం వెంకటాపురం మండల తహసీల్దార్ కార్యాలయాన్ని ముట్టడిచేయడం జరిగింది.

 

ప్రభుత్వం పోడుపట్టాలు ఇస్తామనిచెప్పి రాష్ట్రం లో అక్కడక్కడా పరిమితిగా హక్కు పత్రాలుఇచ్చి అధిక మొత్తం లో ఆదివాసీలకు రావలసిన హక్కుపత్రాల గురించి ప్రభుత్వం నోరుఎందుకు మెదపడం లేదని ప్రశ్నించారు.రెండు మండలాలు కలిపి సుమారు నాలుగు వేలమంది ఆదివాసీలు దరఖాస్తు చేసుకోగా కేవలం 15 మందికి హక్కుపత్రాలు ఇచ్చారని అన్నారు.

 

ALSO READ : 

1. Rythu Bima : రైతు భీమాకు ధరఖాస్తులు.. ఇలా చేసుకోవాలి..!

2. Lands : ఆ భూములకు కూడా రైతు బంధు.. వారికి కూడా రైతు బీమా..!

 

ఆదివాసీల చేతిలో పది రూపాయలుపెట్టి పండగ చేసుకోమన్నట్టుగా ప్రభుత్వ తిరున్నట్లు ఏద్దేవా చేశారు. అటవీ శాఖ అధికారులు, ప్రభుత్వం కలిసి ఆదివాసీలను ఏమార్చుతున్నట్లు ఆయన పేర్కొన్నారు.పోడు పట్టాల మంజూరు లో ములుగు జిల్లాకు తీవ్ర అన్యాయం జరిగినట్లు ఆయన తెలిపినారు.

 

ALSO READ :

1. Railway : నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. రైల్వే లో ఖాళీ పోస్టులకు నోటిఫికేషన్..!

2. Reshan Card : రేషన్ కార్డు ఉన్నవాళ్లందరికీ.. గుడ్ న్యూస్..!

 

పెసా చట్టం ద్వారా ఎన్నిక అయిన ప్రజా ప్రతినిధులు సాగులో వున్న పోడుభూముల విషయంలో పెసాచట్టాన్ని ఎందుకు త్రుంగలోతొక్కారో సమాధానం చెప్పాలన్నారు.గిరిజన ప్రజా ప్రతినిధులు పోడుభూముల గ్రామసభలో వుండికూడా అటవీహక్కులచట్టం అమలు లో నిర్లక్ష్యం వహించి అధికారులకు వత్తాసుపలికి గిరిజనులకు అన్యాయం చేశారన్నారు.పోడుభూముల సాగులోవున్న గిరిజనులను తొలగించే అధికారం అటవీ హక్కులచట్టంప్రకారం ఫారెస్ట్ అధికారులకు లేదన్నారు.

 

అటవీహక్కుల చట్టం తెలుసుకొని ఫారెస్ట్ అధికారులు వ్యవహరించాలని,గిరిజనుల పై దాడిచేయడం సరికాదని అన్నారు.అటవీ హక్కుల చట్టంలో పేర్కొన్న విధంగా గ్రామసభలుపెట్టిఉంటే నేడు రెండు మండలాల ఆదివాసీలకు ఇంతటి అన్యాయం జరిగి ఉండేది కాదన్నారు.పెసా గ్రామసభలు పెట్టకుండా మోస పూరితమైన సభలుపెట్టి హక్కు పత్రాలురాకుండా ఆనాడు అడ్డుకున్నారని మండిపడ్డారు.

 

ఆర్ ఐ,సెక్షన్ అధికారి దేవకు పలు డిమాండ్ల తో కూడిన వినతి పత్రం అందజేశారు. దశాబ్దాలుగా సాగులోఉండి సర్వే చేయని భూములు అనేకం ఉన్నాయని,వాటిని కూడా తక్షణమే సర్వే చేయాలని డిమాండ్ చేశారు. గ్రామసభలో ఆమోదం పొందిన లబ్ది దారులందరికి హక్కు పత్రాలు ఇవ్వాలని వినతి పత్రం లో పేర్కొన్నారు.గతంలోపోడు సాగుదారుల పైన పెట్టిన అక్రమ కేసులు అన్నిటిని ఎత్తివేయాలని, సాగుదారులను అడ్డుకుంటున్న అధికారుల పైన చర్యలు తీసుకోమని తహసీల్దార్ కు విన్నవించారు.

 

హక్కుపత్రాలు ఇవ్వకుండా ఆదివాసీలను మోసం చేయాలని చూస్తే రానున్న ఎన్నికల్లో కెసిఆర్ కు ఆదివాసీలు బుద్ధి చెప్తారని హెచ్చరించారు.ఈ కార్యక్రమం లో నాయకులు భార్గవ్, మహేష్,కిరణ్,అట్టం. లక్ష్మయ్య,వాజేడు, వెంకటాపురం మండలాల పోడు రైతులు పాల్గొన్నారు.