Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
తెలంగాణBreaking Newsజిల్లా వార్తలునల్గొండరాజకీయం

Nalgonda : అంగన్వాడీలకు కనీస వేతనం రూ.26 వేలు ఇవ్వాలి..!

Nalgonda : అంగన్వాడీలకు కనీస వేతనం రూ.26 వేలు ఇవ్వాలి..!

నల్లగొండ, మన సాక్షి :

తెలంగాణ రాష్టం లో గల ఐ సి డి ఎస్ లో పని చేస్తున్న అంగన్వాడీ టీచర్స్ & హెల్పర్స్ కు ప్రభుత్వం కనీస వేతనం 26 వేలు వేతనం ఇవ్వాలని ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి, అంగన్వాడి టీచర్స్ అండ్ హెల్పర్స్ అసోసియేషన్ జిల్లా గౌరవ అధ్యక్షులు పల్లా దేవేందర్ రెడ్డి ప్రభుత్వాన్ని కోరారు.

మంగళవారం ఏఐటియుసి ఆధ్వర్యంలో నల్లగొండ జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు అంగన్వాడీలు ధర్నా నిర్వహించడం జరిగింది ఈ సందర్భంగా దేవేందర్ రెడ్డి మాట్లాడుతూ మినీ నుండి పదోన్నతి పొందిన వారికీ పెంచిన గౌరవ వేతనం 9 నెలలు పెండింగ్ లో ఉన్నాయని వాటిని తక్షణమే ఇవ్వాలనీ
అంగన్వాడీ టీచర్స్ కు సూపర్వైజర్ పదోన్నతి కల్పించాలి ఆయన ప్రభుత్వాన్ని కోరారు.

జిపి యాప్ సడలించాలని రిజిస్టర్ల పైన స్పష్టత ఇవ్వాలి, పెండింగ్ లో ఉన్న ఇంటి అద్దె లు , గ్యాస్ బిల్స్ , ఆరోగ్య లక్మి బిల్స్ , ఈవెంట్ బిల్స్ , స్టేషనరీ బిల్స్ , తక్షణం విడుదల చేయాలని ఆయన కోరారు.
మెనూ ఛార్జి లు 10 ఏళ్ల క్రితం ఉన్న మార్కెట్ రేట్లు ప్రకారం ఉన్నాయి ప్రస్తుత మార్కెట్ లో కూరగాయలు ధరలు, సరుకులు ధరలు ఆకాశాన్ని ఆంటుచున్నవి కావున గర్భిణీ కు బాలింత కు 20 రూపాయలు చిన్నారులు కు 15 రూపాయలు మెనూ పెంచాలి అని కోరారు.

అంగన్వాడీ కేంద్రాలుకు కరెంట్ , త్రాగునీరు , మరుగు దొడ్లు, నూతన భవనాలు కట్టించాల అని , గర్భిణీ స్త్రీ లు కూర్చునేదుకు చైర్స్ అందించాలి అని , సెంటర్ లకు వంట పాత్రలు , షొప్స్ , చాపలు , ఛార్ట్స్ , అందించాలి అని అన్నారు. రిటైర్డ్మెంట్ బెనిఫిట్స్ టీచర్ కు 10 లక్షలు , ఆయాకు 5 లక్షలు రూపాయలు ఇవ్వాలని కాళిగా ఉన్న టీచర్స్ & హెల్పర్స్ భర్తీ చెయ్యాలి అని కోరారు.

కేంద్ర ప్రభుత్వం ఐసిడిఎస్ నిర్వీర్యం చేసే కుట్రలో భాగంగా బడ్జెట్ కేటాయింపులు తగ్గిస్తూ వస్తుందని ఆరోపించారు ఐసిడిఎస్ పరిరక్షణ కోసం పోరాటాలను తీవ్రతరం చేయాలని ఆయన పిలుపునిచ్చారు. నల్లగొండ కలెక్టర్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించి అనంతరం ఏవో మోతిలాల్ గారికి మెమోరాండం సమర్పించడం జరిగింది.

ఈ కార్యక్రమంలో ఏఐటియుసి జిల్లా ఉపాధ్యక్షులు కేఎస్ రెడ్డి గీత పని వారల సంఘం జిల్లా కార్యదర్శి పి వీరస్వామి తెలంగాణ అంగన్వాడి టీచర్ మరియు హెల్పర్ అసోసియేషన్ జిల్లా ఉపాధ్యక్షురాలు ఏం శాంతకుమారి. నేనావత్ విజయ అంజలి ఏ యాదమ్మ కవిత జయమ్మ భాగ్యమ్మ జయమ్మ పద్మ వసీమా బేగం స్వప్న నిర్మల సరస్వతి భారతి సునీత మంగ సుశీల ధనమ్మ జయమ్మ సైదమ్మ సంతోష స్వర్ణ పార్వతి జ్యోతి కవిత తదితరులు పాల్గొన్నారు.

MOST READ : 

మరిన్ని వార్తలు