డబ్బులు అడిగినందుకు వ్యక్తిపై దాడి.. మృతి..!

డబ్బులు అడిగినందుకు వ్యక్తిపై దాడి.. మృతి..!

వలిగొండ , మన సాక్షి:

వలిగొండ మండల పరిధిలోని చిత్తాపురం గ్రామంలో ట్రాక్టర్ తో పొలం దున్నిన డబ్బులు అడిగినందుకు వ్యక్తిపై దాడి చేయగా వ్యక్తి మృతి చెందిన ఘటన మండలంలోని చిత్తాపురం గ్రామంలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం వలిగొండ మండలం చిత్తాపురం గ్రామానికి చెందిన కొల్లు నర్సిరెడ్డి (62) తన ట్రాక్టర్ తో అదే గ్రామానికి చెందిన ఆరూరు వెంకటయ్య భూమిని గత కొంతకాలంగా దున్నుతున్నాడు.

 

ఎప్పటి మాదిరిగానే తన పొలాన్ని దున్నటానికి రమ్మని పిలువగా పాత డబ్బులు ఇస్తేనే పోలం దున్నడానికి వస్తానని తెలుపగా ఆరూరు వెంకటయ్య కుమారులైన అరూర్ ఉపేందర్, అరూరు శ్రవణ్ , బాలమ్మ నర్సిరెడ్డిని శుక్రవారం రోజున మధ్యాహ్నం ఒంటిగంట సమయాన గ్రామపంచాయతీ వద్ద అరూర్ ఉపేందర్ దాడి చేసి పొత్తికడుపులో బూటు కాలుతో తన్నగా అక్కడే స్పృహ తప్పి పడిపోయాడు.

 

ALSO READ :

  1. Womens : నిరుపేద మహిళలు.. రాత్రికి రాత్రే కోటీశ్వరులు అయ్యారు..!
  2. Restarent : ఆ రెస్టారెంట్ లో తినాలంటే నాలుగేళ్ల ముందే బుక్ చేసుకోవాలంట.. స్పెషల్ ఏంటో..?
  3. Chicken : చికెన్ కిలో రూ.100 మాత్రమే.. గంటలోనే అన్ని షాపుల్లో ఖాళీ..!
  4. Atm Card : ఏటీఎం కార్డు వినియోగదారులకు ఆర్బీఐ కొత్త రూల్స్.. మారిన నిబంధనలు..!

 

సమాచారం తెలుసుకున్న నర్సిరెడ్డి కుమారుడు కోళ్ళు శేఖర్ రెడ్డి వెళ్లి చూడగా పడిపోయి ఉన్నాడు దీంతో 108 వాహనంలో రామన్నపేట ఆసుపత్రికి తరలించగా అక్కడ పరిశీలించిన డాక్టర్లు భువనగిరి ఏరియా ఆసుపత్రికి తీసుకు వెళ్లాల్సిందిగా సూచించారు దీనితో మార్గమధ్యలో నర్సిరెడ్డి ప్రాణాలు వదిలారు. మృతుని కుమారుడు కోళ్ళు శేఖర్ రెడ్డి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నామని ఎస్సై పెండ్యాల ప్రభాకర్ తెలియజేశారు.