రక్తదానంలో రఘువీర్ రికార్డ్

59 సార్లు రక్తదానం

రక్తదానంలో రఘువీర్ రికార్డ్

59 సార్లు రక్తదానం

నారాయణపేట, మన సాక్షి: ఏకంగా 59 సార్లు రక్తదానం చేసి నారాయణపేట జిల్లా కేంద్రానికి చెందిన ప్రముఖ న్యాయవాది ప్రస్తుత కేంద్ర ప్రభుత్వ సహాయ న్యాయవాది జి.రఘువీర్ యాదవ్ రికార్డు సృష్టించారు. ఉమ్మడి  పాలమూరు జిల్లాలోనే 59 సార్లు రక్తదానం చేసిన వారులేరు.

అయితే రఘువీర్ యాదవ్ చదువుకుంటున్న రోజుల్లో ఎబివిపిలో పనిచేస్తూ స్వామి వివేకానందుని స్ఫూర్తి తో విద్యార్తి దశనుంచే రక్తదానం అలవారుచుకున్నారు.ఎక్కడ ఈసందర్భంలో ఏ సంస్థ రక్తదానం శిబిరాలు ఏర్పాటు చేసినా అక్కడికెళ్లి రక్తదానం చేయడం అలవాటుగా మార్చుకున్నారు.

ఇప్పటికి 57 సంవత్సరాల వయసులోనూ రక్తదానం చేస్తూ యువకులకు ఆదర్శంగా నిలిచారు.ఇన్ని సార్లు రక్తదానం చేసిన రఘువీర్ ను రెడ్ క్రాస్ సంస్థ,లైన్స్ క్లబ్ థెరిసా ఫౌండేషన్లు ఇలా అనేక సంస్థల నుంచి సన్మానాలు అభినందనలు పొందారు.

ఈ సందర్భంగా రఘువీర్ యాదవ్ మాట్లాడుతూ రక్తదానం మహదనమని అన్నారు.మన రక్తదానం తో ఇతరుల ప్రాణం దక్కించిన వారం అవుతామన్నారు.తాను వివేకానంద స్పూర్తితో రక్తదానానికి అలవాటు పడ్డానన్నా రు.59 సార్లు రక్తదానం చేయడం సంతోషంగా ఉందన్నారు.ప్రతి ఒక్కరు రక్తదానం చేసి ప్రాణదాతలు కావాలని కోరారు.