Telangana : తెలంగాణ నయాగారం… బోగత జలపాతం వద్ద పర్యాటకుల సందడి..!
Telangana : తెలంగాణ నయాగారం… బోగత జలపాతం వద్ద పర్యాటకుల సందడి..!
పర్యాటకులు జాగ్రత్తలు పాటించాలి – వాజేడు ఎస్ఐ రేఖ అశోక్
వాజేడు (ములుగు) జులై 09, మన సాక్షి
తెలంగాణ నయగారంగా బోగత జలపాతం నిలిచింది. తెలంగాణలోని ములుగు జిల్లా వాజేడు మండలం చీకుపల్లి అటవీప్రాంతములో తెలంగాణ నయాగరంగా గుర్తింపు పొందిన బొగత జలపాతంకు పర్యాటకుల సందడి పెరిగింది.
తెలంగాణతో పాటు ఆంధ్రప్రదేశ్, చత్తీస్గడ్ కు సంబంధించిన పర్యాటకులు కూడా బోగత జలపాతం కు వస్తున్నారు. జలపాతం వద్దకు వచ్చే పర్యాటకులు తగు జాగ్రత్తలు పాటించాలని వాజేడు ఎస్ఐ రేఖ అశోక్ తెలిపారు.
ALSO READ : 👇
1. Lands : ఆ భూములకు కూడా రైతు బంధు.. వారికి కూడా రైతు బీమా..!
2. Telangana : బీ ఈడి, డి ఈడీ అభ్యర్థులకు గుడ్ న్యూస్… మళ్లీ టెట్.. ఇవీ విధి విధానాలు..!
3. Telangana : కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ పోస్టుల భర్తీకి ఉత్తర్వులు.. 2858 పోస్టులు..!
4. Gpay : గూగుల్ పే వాడుతున్నారా.. అయితే మీకు అదిరిపోయే రెండు శుభవార్తలు..!
5. Reshan Card : రేషన్ కార్డు ఉన్నవాళ్లందరికీ.. గుడ్ న్యూస్..!
జలపాతములు మరియు అడవి అందాలను చూసి ఆనందించుటకు విచ్చేయుచున్న మూడు రాష్ట్రాల ప్రజలు పోలీసు వారికి , అటవీ శాఖ సిబ్బందికి స్థానిక గ్రామ ప్రజలకు సహకరించాలని పేర్కొన్నారు.
నాట్ అలౌడ్ , డేంజర్ బోర్డులను దాటి లోతట్టు నీటి ప్రాంతానికి వెళ్లకూడదని ప్రమాదలకు గురవుతున్నారని తెలిపారు. లోతట్టు ప్రాంతానికి వెళ్లి సెల్ఫీలు దిగటం వల్ల ప్రమాదం జరుగుతుందని, జలపాతంలో పడి ప్రాణాలతో బయటపడినట్టు చరిత్రలో లేదని తెలియజేశారు .
గజ ఈతగాళ్లతో గాలింపు చర్యలు చేపట్టినా.. 24 గంటలు దాటుతే తప్ప బయటకు తేలుతున్నారని సెక్యూరిటీ పకడ్బందీ చూడాలని తెలిపారు.
అలాగే మద్యం సేవించి వాహనాలు నడపకూడదని అలాంటి వారి పై చట్టరీత్యా చర్యలు తీసుకొనబడునని వాజేడు ఎస్ఐ హెచ్చరించారు.











