Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
Breaking Newsజిల్లా వార్తలుతెలంగాణనల్గొండ

Central Lighting : ఆ హైవేపై పగలు రాత్రి తేడా ఉండదు.. నిరంతరం సెంట్రల్ లైటింగ్ వెలుగుతూనే ఉంటాయి..!

Central Lighting : ఆ హైవేపై పగలు రాత్రి తేడా ఉండదు.. నిరంతరం సెంట్రల్ లైటింగ్ వెలుగుతూనే ఉంటాయి..!

పట్టించుకోని అధికారులు, వేల యూనిట్ల విద్యుత్ వృధా

కొండ మల్లేపల్లి , మన సాక్షి:

నల్గొండ జిల్లా దేవరకొండ నియోజకవర్గం లోని కొండ మల్లేపల్లి పట్టణంలో నాగార్జున సాగర్ హైవే పైన ఏర్పాటు చేసిన సెంట్రల్ లైటింగ్ పట్టపగలే వెలుగుతున్న పట్టించుకునే వారే లేరు. సెంట్రల్ లైటింగ్ పర్యవేక్షణ కరువై అధికారుల నిర్లక్ష్యాన్ని ఎత్తిచూపుతున్నాయి. దీంతో విలువైన విద్యుత్ వృధా అవుతుందన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

వీటి నిర్వహణలో ఉన్న సమస్యలను విద్యుత్ సిబ్బంది పట్టించుకోవడం లేదని పలువురు విమర్శిస్తున్నారు. హైవే పైన ఉన్న సెంట్రల్ లైటింగ్ నిరంతరం వెలుగుతూనే ఉండడం వల్ల పగలు రాత్రి తేడా లేకుండా వెలుగు తుండంతో వందలాది యూనిట్ల విద్యుత్ వృధా అవుతుంది.

ప్రభుత్వం నిరంతరం విద్యుత్‌ను అందించడానికి వేల కోట్ల వెచ్చిస్తున్నా విద్యుత్‌ను ఆదా చేయాల్సిన సంబంధిత అధికారుల నిర్లక్ష్యంగా వ్యవరిస్తున్నారని స్థానిక ప్రజలు అంటున్నారు.

ALSO READ: 

Gruhajyothi : అన్ని అర్హతలు ఉన్నా జీరో కరెంట్ బిల్లు రాదాయే.. అయోమయ పరిస్థితిలో గృహ జ్యోతి..!

BRS : పార్టీ మారుతావా.. అంటూ బీఆర్ఎస్ నాయకుడిని చెప్పుతో కొట్టిన మహిళ, ఫోటోలు వైరల్..!

హత్య కేసులో నిందితుడికి జీవిత ఖైదు..!

Reporters Arrest : విలేకరుల బ్లాక్ మెయిల్.. కుటుంబం ఆత్మహత్య.. ఇద్దరు అరెస్టు, పరారీలో ముగ్గురు..!

మరిన్ని వార్తలు