Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
Breaking Newsతెలంగాణరాజకీయంహైదరాబాద్

KCR : తెలంగాణ తల్లిని మార్చడం మూర్ఖత్వం.. కెసిఆర్ రీ ఎంట్రీ అప్పుడే..!

KCR : తెలంగాణ తల్లిని మార్చడం మూర్ఖత్వం.. కెసిఆర్ రీ ఎంట్రీ అప్పుడే..!

మన సాక్షి , వెబ్ డెస్క్ :

తెలంగాణ తల్లిని మార్చడం మూర్ఖత్వమని మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. తన ఫామ్ హౌస్ లో బీఆర్ఎస్ నేతలతో కీలక సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశంలో భాగంగా ఆయన మాట్లాడుతూ రేవంత్ రెడ్డి సర్కార్ పై కేసీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణ తల్లిని మార్చడం మూర్ఖత్వం అని పేర్కొన్నారు.

ఈ విషయాన్ని అసెంబ్లీలో ప్రస్థానం తీసుకురావాలని ఎమ్మెల్యేలకు ఆయన సూచించారు. తెలంగాణ ఉద్యమ సమయంలో తెలంగాణ తల్లి విగ్రహం నింపిన స్ఫూర్తిని అందరికీ వివరించాలంటూ ఆయన పిలుపునిచ్చారు. పాలనపై దృష్టి పెట్టాలి కానీ ఇలా విగ్రహాలు, గుర్తులు మార్చడం కాదంటూ ఆయన సూచించారు.

కాంగ్రెస్ ప్రభుత్వం అన్ని రంగాల్లో విఫలమైందని కేసీఆర్ పేర్కొన్నారు. అయితే శీతాకాల సమావేశాలకు ఆయన హాజరు కావడం లేదని స్పష్టంగా అర్థమవుతుంది. అయితే ఫిబ్రవరిలో బీఆర్ఎస్ నిర్వహించే బహిరంగ సభలో కేసీఆర్ పాల్గొని రీ ఎంట్రీ ఇచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి.

MOST READ : 

మరిన్ని వార్తలు