Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
TOP STORIESBreaking Newsజాతీయం

Free Laptop Scam : ఉచితంగా ల్యాప్ టాప్.. కేంద్రం పథకం.. ఇది తెలుసుకోండి..!

Free Laptop Scam : ఉచితంగా ల్యాప్ టాప్.. కేంద్రం పథకం.. ఇది తెలుసుకోండి..!

మన సాక్షి, వెబ్ డెస్క్:

కేంద్ర ప్రభుత్వం అనేక రకాల కొత్త కొత్త పథకాలు ప్రవేశపెడుతుంది. విద్యార్థుల కోసం ఎన్నో రకాల స్కాలర్షిప్ లు ఉన్నత విద్యను అభ్యసించేందుకుగాను ప్రవేశపెడుతుంది. ఈ క్రమంలోనే విద్యార్థులకు కేంద్ర ప్రభుత్వం ఉచిత లాప్ టాప్ ఇస్తుందనే అంశంపై సోషల్ మీడియాలో విరివిగా ప్రచారం జరుగుతుండగా దాని గురించి తెలుసుకోవాల్సి ఉంది…

విద్యార్థుల కోసం కేంద్ర ప్రభుత్వం, పేద విద్యార్థులు చదువుకునేందుకు స్కాలర్ షిప్ లు, విదేశాలకు వెళ్లేందుకు ఇంటర్న్ షిప్ లు అందజేస్తుంది. కాగా కొంతమంది ప్రజలు తప్పుదారి పట్టించేందుకు అసత్య పథకాలు కూడా ఉన్నట్లు ప్రచారం చేస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం ఉచితంగా విద్యార్థులకు లాప్ టాప్ ఇస్తుందనేది కూడా అసత్య ప్రచారంలో భాగమే అని చెప్పవచ్చును.

సోషల్ మీడియాలో ఇది విరివిగా ప్రచారం జరుగుతుంది. ఈ తప్పుడు ప్రచారం ద్వారా విద్యార్థులకు ఉచితంగా లాప్ టాప్ ఇస్తుందని ఆల్ ఇండియా కౌన్సిల్ ఫర్ ఎడ్యుకేషన్ (AICTE) ఈ పథకాన్ని అందజేస్తుందని, దీనిని సద్వినియోగం చేసుకోవాలని సోషల్ మీడియాతో పాటు వెబ్ సైట్ లలో తప్పుడు ప్రచారం చేస్తున్నారు. అయితే ఇది ఒక పెద్ద స్కాం అని తేలిపోయింది.

ఈ తప్పుడు ప్రచారాన్ని నమ్మొద్దని ఏఐసిటిఈ ఒక సర్కిలర్ ను కూడా 2024 నవంబర్ 27వ తేదీన జారీ చేసింది. ఆ సర్కులర్ లో ఏముందంటే.. ఒక ఫేక్ న్యూస్ ఆర్టికల్ సోషల్ మీడియాలో, వెబ్ సైట్ లలో సర్కులేట్ అవుతుంది. అందులో ఏఐసిటిఈ విద్యార్థులకు ఉచితంగా ల్యాప్ టాప్ ఇస్తుందని చెబుతున్నారు. అది మొత్తం పూర్తి అబద్ధం. ప్రజలను తప్పుదారి పట్టిస్తున్నారు. ఆ న్యూస్ కు ఏఐసిటిఈ కి ఎలాంటి సంబంధం లేదని సర్కులర్ లో పేర్కొన్నారు.

అదేవిధంగా విద్యార్థులకు ఉచితంగా ల్యాప్ టాప్ లను అందించడానికి ప్రభుత్వం ఎటువంటి పథకాన్ని ప్రారంభించలేదు. అలాంటి ప్రోగ్రామ్ కు సంబంధించి నోటిఫికేషన్ గానీ, అధికారికంగా సమాచారం గానీ రాలేదు. ఈ పథకాన్ని ఇలా పొందండి అంటూ చెప్పిన విధానం అంతా నకిలీయే అని సర్కులర్ లో వివరించారు.

అయితే ఇలాంటి నకిలీ పథకాల గురించి తెలియజేసినప్పుడు అధికారిక వెబ్ సైట్, అధికారిక సోషల్ మీడియా అకౌంట్ ఈ పరిశీలించాలని సూచించింది. లాప్టాప్ స్కీమ్ ని కేంద్రం ఇస్తుందని చెబితే అస్సలు నమ్మొద్దని, ఇదే కాదు ఏ పథకమైనా అధికారిక పోర్టల్ మాత్రమే నమ్మాలని చెప్పింది.

MOST READ :

 

మరిన్ని వార్తలు