Runamafi : రుణమాఫీ ప్రకటించిన సిఎం రేవంత్ రెడ్డి చిత్రపటానికి రైతుల పాలాభిషేకం..!

రైతు రుణమాఫీ ప్రకటించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చిత్రపటానికి కిసాన్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో రైతులు పాలాభిషేకం చేయడం జరిగింది

Runamafi : రుణమాఫీ ప్రకటించిన సిఎం రేవంత్ రెడ్డి చిత్రపటానికి రైతుల పాలాభిషేకం..!

మిర్యాలగూడ, మన సాక్షి:

రైతు రుణమాఫీ ప్రకటించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చిత్రపటానికి నల్గొండ జిల్లా మిర్యాలగూడలో కిసాన్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో రైతులు పాలాభిషేకం చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా కిసాన్ కాంగ్రెస్ జిల్లా అధ్యక్షులు ముదిరెడ్డి నర్సిరెడ్డి పాల్గొని మాట్లాడుతూ రైతులకు ఏకకాలంలో 2 లక్షల రూపాయలు రుణమాఫీని రాష్ట్రవ్యాప్తంగా ఉన్న రైతులందరికీ 31 వేల కోట్ల రూపాయలను కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ప్రకటించడం హర్షంచదగ్గ విషయం అన్నారు.

కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీల్లో భాగంగా మాట తప్పకుండా అమలు చేస్తా ఉందని, రాబోయే రోజుల్లో బడుగు బలహీన వర్గాలకు రైతులకు మేలు చేసే విధంగా కాంగ్రెస్ పార్టీ పని చేస్తుందని అన్నారు. కాంగ్రెస్ పార్టీ అంటేనే రైతు శ్రేయస్సు కోరే పార్టీ అని, రాష్ట్రంలో రైతులందరూ బాగుంటేనే రాష్ట్రం బాగుంటుందని తెలిపారు.

ఈ కార్యక్రమంలో బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు తలకొప్పుల సైదులు , మైనార్టీ సెల్ జిల్లా అధ్యక్షులు సలీం, ఎన్ఎస్ యు ఐ జిల్లా అధ్యక్షులు ఆరిఫ్ , మండల పార్టీ అధ్యక్షులు కాకునూరి బసవయ్య గౌడ్, సీనియర్ నాయకులు ఆవుల బక్కా రెడ్డి , పోలగాని వెంకటేష్ గౌడ్, జెట్టి వెంకటేశ్వర్లు, యూత్ కాంగ్రెస్ ఉపాధ్యక్షులు ఇమ్రాన్ , ఐఎన్టీయూసీ అధ్యక్షులు చాంద్ పాషా, పోలిశెట్టి అజయ్ , పానుగోతు మల్సూర్, హరికృష్ణ తదితరులు పాల్గొన్నారు.

ALSO READ  :

Ys Jagan : వైసీపీ కార్యాలయం కూల్చివేత పై మాజీ సీఎం జగన్ సంచలన ట్వీట్..!

Jobs : పదవ తరగతి మార్కులతో ఉద్యోగాలు.. మీరూ దరఖాస్తు చేసుకోండి..!

Miryalaguda: రైస్ మిల్లుల్లో పొల్యూషన్ అధికారుల తనిఖీలు..!