సూర్యాపేట : నకిలీ విత్తనాల కట్టడికి టాస్క్ ఫోర్స్ బృందాల ఏర్పాటు..!

నకిలీ విత్తనాల వల్ల వ్యవసాయం చేసే రైతు లు నష్టపోకుండా అధికారులు చర్యలు తీసుకోవాలను జిల్లా ఎస్పీ బి కే రాహుల్ హగ్డే కోరారు.

సూర్యాపేట : నకిలీ విత్తనాల కట్టడికి

టాస్క్ ఫోర్స్ బృందాల ఏర్పాటు..!

సూర్యాపేట, మనసాక్షి :

నకిలీ విత్తనాల వల్ల వ్యవసాయం చేసే రైతు లు నష్టపోకుండా అధికారులు చర్యలు తీసుకోవాలను జిల్లా ఎస్పీ బి కే రాహుల్ హగ్డే కోరారు. బుధవారం ఎస్పీ కార్యలయంలో ఏర్పాటు చేసిన వ్యవసాయ, పోలీస్ అధికారుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ అధికారులు తనిఖీలు నిర్వహిస్తూ నకిలీ విత్తనాలు గుర్తించి సీజ్ చేయాలనీ నకిలీ విత్తనాల వల్ల జిల్లాలో ఒక్క రైతు కూడా నష్టపోవద్దు అని అన్నారు.

జిల్లాలో డిఎస్పీ ల అధ్వర్యంలో వ్యవసాయ అధికారులతో కలిసి టాస్క్ ఫోర్స్ బృందాలు ఏర్పాటు చేశాం అన్నారు. రాష్ట్రానికి దేశానికి వ్యవసాయం ముఖ్యమైన ఆధారం అలాంటి వ్యవసాయం చేసే రైతులు ఆరుగాలం కష్టపడి నష్టపోకుండా చూడాల్సిన బాధ్యత కూడా విత్తన, ఎరువుల డీలర్ల పై ఉందన్నారు.విత్తన వ్యాపార డీలర్స్ బాధ్యతగా మంచి నాణ్యమైన విత్తనాలు సరఫరా చేయాలి అన్నారు.

రాష్ట్ర ప్రభుత్వం నకిలీ విత్తనాల నివారణకు కట్టుబడి ఉన్నందున, రైతులకు నష్టం జరగకుండా అండగా ఉండాలని ఆదేశించారు. పోలీసు, వ్యవసాయ శాఖ అధికారులతో మండల, సర్కిల్, జిల్లా స్థాయి అధికారులు సమన్వయంతో పటిష్టమైన నిఘా ఏర్పాటు చేసి నకిలీ విత్తనాలు ముందాగానే గుర్తిస్తాం అన్నారు.

సూర్యాపేట జిల్లా ఆంధ్రా రాష్ట్రానికి ముఖ్య సరిహద్దుగా ఉన్నది, కృష్ణ పట్టి వెంట నకిలీ విత్తనాలు ఎక్కువగా సరఫరా అయ్యే అవకాశం ఉన్నది, నకిలీ విత్తనాల సరఫరా అనేది ఇక్కడ క్లిష్టమైన సమస్య అని తెలిపారు.ముందస్తు తనిఖీలు, రైతులకు అవగాహన కల్పించడం, డీలర్స్ కు అవగాహన కల్పించడం, సరిహద్దు లలో పటిష్టమైన నిఘా తో నకిలీ విత్తనాలు నివారించాలనీ కోరారు.

జిల్లాలో పత్తి, మిర్చి పండించే రైతులు ఎక్కువగా ఉంటారు కావున వారితో సమావేశాలు నిర్వహించి చైతన్య పరచాలి అన్నారు. గతంలో నకిలీ విత్తనాల కేసుల్లో సంబంధం ఉన్నవారి పై నిఘా ఉంచాలి, సస్పెక్ట్ సీట్స్ నమోదు చేస్తాం అన్నారు. గ్రామాల్లో రైతులకు, సమన్వయ సమితిలకు, రైతు సంఘాలకు అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలి, సహాయ సహకారాలు అందించే విధంగా అధికారులు అందుబాటులో ఉండాలి అన్నారు.

అన్ని గ్రామాల్లో వ్యవసాయ శాఖ, పోలీసు అధికారుల ఫోన్ నంబర్ల తెలిసే విధంగా ఫ్లెక్సీలు ఏర్పాటు చేయాలి అన్నారు.
వ్యవసాయ శాఖ అధికారి జి శ్రీధర్ రెడ్డి మాట్లాడుతూ నకిలీ విత్తనాల నివారణకోసం కలిసి పని చేయాలని, తనిఖీలు చేసే సమయంలో పరిశీలించాల్సిన రికార్డ్స్, సర్టిఫికెట్స్, లేబుల్, కంపెనీ వివరాలు, అనుమతి స్టాండర్డ్స్, మొదలగు వాటి గురించి పోలీసు అధికారులకు వివరించారు.

ఈ సమావేశంలో అధనపు ఎస్పీ నాగేశ్వర రావు, ట్రైనీ ఐపిఎస్ అధికారి రాజేష్ మీనా, వ్యవసాయ శాఖ అధికారి శ్రీధర్ రెడ్డి, జిల్లా ఉద్యానవన శాఖ అధికారి టి నాగయ్య, డీఎస్పీ లు రవి, శ్రీధర్ రెడ్డి, టాస్క్ ఫోర్స్ డీఎస్పీ మట్టయ్య, సైబర్ సెక్యూరిటీ డీఏస్పీ శ్రీనివాసరావు, స్పెస్పల్ బ్రాంచ్ ఇన్స్పెక్టర్ వీర రాఘవులు, సి ఐ లు, ఎసై లు, మండల వ్యవసాయ అధికారులు సిబ్బంది పాల్గొన్నారు.