Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
TOP STORIESజాతీయం

వంటగ్యాస్ సబ్సిడీ రూ. 200 వాళ్లకు మాత్రమే

వంటగ్యాస్ సబ్సిడీ రూ. 200 వాళ్లకు మాత్రమే

హైదరాబాద్, మనసాక్షి : కేంద్ర ప్రభుత్వం పెట్రోలు, డీజిలు ధరలు తగ్గించి కొంత ఉపశమనం కలిగించింది. అదేవిధంగా వంట గ్యాస్ కు కూడా రూ. 200 సబ్సిడీ అందజేయనున్నట్లు పేర్కొన్నది. కానీ కేంద్ర ప్రభుత్వం గ్యాస్ పై రూ. 200 ఇచ్చేది కేవలం ఉజ్వల పథకం లబ్ధిదారులకు మాత్రమే. రెండు వందల రూపాయల సబ్సిడీ కూడా కేవలం ఏడాదిలో 12 సిలిండర్లకు మాత్రమే ఇవ్వనున్నారు. కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మల సీతారామన్ మాట్లాడుతూ “మేము లీటర్ పెట్రోల్ పై ఎనిమిది రూపాయలు, డీజిల్ పై 6 రూపాయల చొప్పున సెంట్రల్ ఎక్సైజ్ సుంకాన్ని తగ్గించాం అన్నారు. దీంతో లీటర్ పెట్రోల్ పై 9.5 రూపాయలు, డీజిల్ పై ఏడు రూపాయలు తగ్గుతుంది. ఈ సంవత్సరం 9 కోట్ల మందికి పైగా ప్రధానమంత్రి ఉజ్వల యోజన అధికారులకు గ్యాస్ సిలిండర్ పై 200 రూపాయల సబ్సిడీని అందిస్తున్నాం పేర్కొన్నారు.

ఇవి కూడా చదవండి :

1. ఫ్లాష్.. ఫ్లాష్.. నల్గొండ జిల్లాలో లారీ ఢీకొని ఇద్దరు మృతి

2. మూడు నెలలుగా మృత్యువుతో పొరాడి … చివరికి

3. జయశంకర్ సార్ గ్రామంలో రైతులతో కలిసి రేవంత్ రెడ్డి భోజనం 

మరిన్ని వార్తలు