May Day : ఘనంగా మే డే వేడుకలు..!

ఐఎన్‌టీయూసీ, ఏఐటీయూసీ ఆధ్వర్యంలో కొండ మల్లేపల్లి పట్టణ కేంద్రంలో జెండా ఆవిష్కరించి ఘనంగా 138వ మే డే వేడుకలు జరిగాయి.

May Day : ఘనంగా మే డే వేడుకలు..!

కొండ మల్లేపల్లి, మన సాక్షి:

ఐఎన్‌టీయూసీ, ఏఐటీయూసీ ఆధ్వర్యంలో కొండ మల్లేపల్లి పట్టణ కేంద్రంలో జెండా ఆవిష్కరించి ఘనంగా 138వ మే డే వేడుకలు జరిగాయి. ఈ కార్యక్రమంలో అన్ని ట్రేడ్‌ యూనియన్‌ వర్గాల కార్మికులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా కొండ మల్లేపల్లి మండల ఎంపీపీ దూదిపాల రేఖా శ్రీధర్ రెడ్డి మాట్లాడుతూ ఉద్యమ నినాదంతో ప్రపంచ కార్మికులారా ఒకే తాటిపై పయనిస్తూ మన హక్కుల కోసం పోరాడిన వీరులెందరో ఉన్నారు. ఆనాడు చికాగో నగరంలో ప్రారంభమైన ఉద్యమ పోరాటం నేడు సుస్థిర ఎర్ర జెండాగా మారి పోరాటాలకు స్ఫూర్తిగా నింపిందన్నారు. అలాగే మనకు అవసరమైన కార్మిక చట్టాలను తెచ్చి పెట్టిందన్నారు. రాబోయే రోజుల్లో మరిన్ని ఉద్యమాలు చేపట్టి మన హక్కులు సాధించుకుందామని వారంతా పిలుపునిచ్చారు.

కార్మికరాజ్యం వచ్చినప్పుడే కార్మికులకు పూర్తి హక్కులను రక్షించుకోలగుతామని, పటిష్టంగా అమలు జరుగుతాయన్నారు. ప్రస్తుతం నరేంద్రమోడీ ప్రభుత్వం ఇప్పటికే కార్మికులకు ద్రోహం చేసే విధంగా కార్మికచట్టాలన్నీ యజమానులకు అనుకూలంగా మార్చివేసిందన్నారు. దేశంలో ఉండే ప్రభుత్వరంగ సంస్థలను సైతం అంబానీ, అధానీ, జిందాల్‌ వంటి కార్పొరేట్‌ సంస్థలకు కట్టబెడుతుందన్నారు. రాజ్యాంగ హక్కులకు భంగం కలిగిస్తుందన్నారు.

ఈ కార్యక్రమంలో ఏఐటీయూసీ జిల్లా అధ్యక్షుడు నూనె రామస్వామి, ఏఐటీయూసీ జిల్లా నాయకులు ఎడమ సుమతి, సిపిఐ మండల సహాయ కార్యదర్శి ఎం శేఖరా చారి, కళ్ళు చరణ్ రెడ్డి, మండల యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు మంగ్య నాయక్, సురేందర్ రెడ్డి, జితేందర్, సోమలా నాయక్, ఏఐటీయూసీ మండల కార్యదర్శి వెంకటయ్య, అంగన్వాడి నాయకులు కోట్ల శోభారాణి, రామావత్ బాలు, రామావత్ బోడ, రామస్వామి, శంకర్, రామావత్ సోమల తదితరులు పాల్గొన్నారు.

MOST READ : 

Bjp : తెలంగాణలో డబుల్ ఆర్ ట్యాక్స్ వసూలు చేస్తున్నారు.. ప్రధాని నరేంద్ర మోడీ

Telangana : తెలంగాణ మహిళలకు సర్కార్ శుభవార్త.. ఏకంగా లక్ష రూపాయలు..!

Spr : ఎస్ఎస్సి ఫలితాల్లో ఎస్పిఆర్ విద్యార్థుల ప్రభంజనం..!

Miryalaguda : భార్గవ్ కు ఇప్పుడు గుర్తొచ్చిందా పుట్టినిల్లు.. ఙానారెడ్డి బై ఎలక్షన్ లో వ్యతిరేక ప్రచారం ఎలా చేశారు..!

BREAKING : తక్కువ మార్కులు వచ్చాయని కత్తులతో పొడుచుకున్న తల్లి కూతుర్లు..!