Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
Breaking Newsతెలంగాణవిద్యహైదరాబాద్

Groups : గ్రూప్ -1 మెయిన్స్ పరీక్షలు ప్రారంభం.. సీఎం రేవంత్ రెడ్డి ట్వీట్..!

Groups : గ్రూప్ -1 మెయిన్స్ పరీక్షలు ప్రారంభం.. సీఎం రేవంత్ రెడ్డి ట్వీట్..!

మన సాక్షి, హైదరాబాద్ :

తెలంగాణలో గ్రూప్ -1 మెయిన్స్ పరీక్షలు సోమవారం ప్రారంభమయ్యాయి. ఈనెల 27వ తేదీ వరకు ఈ పరీక్షలు నిర్వహించనున్నారు. సోమవారం మధ్యాహ్నం 2 గంటలకు ప్రారంభమైన ఈ పరీక్షలు సాయంత్రం 5 గంటల వరకు జరగనున్నది.

హైదరాబాద్ సైబరాబాద్ రాచకొండ కమిషనరేట్ల పరిధిలో 46 పరీక్ష కేంద్రాల్లో 31,383 మంది విద్యార్థులు ఈ పరీక్షకు హాజరుకానున్నారు. అన్ని పరీక్ష కేంద్రాలలో BNS 163 సెక్షన్ విధించారు. కాగా రాష్ట్రంలో 563 పోస్టుల భర్తీకి ఈ పరీక్షలు నిర్వహిస్తున్నారు.

కాగా గ్రూప్ వన్ మెయిన్స్ పరీక్ష వాయిదా వేయాలంటూ నిరుద్యోగులు సుప్రీంకోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే. కాగా పరీక్షలకు అన్ని ఏర్పాట్లు చేసినందున ఈ విషయంలో కోర్టు జోక్యం చేసుకోదంటూ సుప్రీంకోర్టు పేర్కొన్నది. దాంతో పరీక్షలు యధావిధిగా ప్రారంభమయ్యాయి.

కాగా గ్రూప్ -1 మెయిన్స్ పరీక్షకు హాజరయ్యే వారికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శుభాకాంక్షలు తెలియజేస్తూ ట్వీట్ చేశారు. ఈరోజు నుండి ప్రారంభం అవుతున్న గ్రూప్ ఓ1 మెయిన్స్ పరీక్షలకు హాజరవుతున్న అభ్యర్థులకు నా శుభాకాంక్షలు అని పేర్కొన్నారు.

ఎటువంటి ఆందోళన చెందకుండా పూర్తి ఏకాగ్రతతో పరీక్షలు రాయాలని ఆయన కోరారు. ఈ పరీక్షల్లో మీరు విజయం సాధించి తెలంగాణ పునర్ నిర్మాణంలో భాగస్వాములు కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నట్లు ఆయన ట్విట్ చేశారు.

 

 

LATEST UPDATE : 

Viral Video : ఆకలేస్తే పాములు వాటిని మింగుతాయి.. ఆ నాగుపాము మింగిన వాటిని ఏం చేస్తుంది.. (వీడియో)

MallaReddy : మల్లారెడ్డి అంటే మజాకా.. డీజె ట్టిల్లు స్టెప్పులతో ఇరగదీసిన మల్లారెడ్డి.. (వీడియో వైరల్)

Nalgonda : పది నెలలుగా పస్తులు.. దీపావళి పండుగకు అయినా అందేనా..!

Viral Video : నేను నిన్ను కొట్టను కానీ.. ఆ టీచర్ రహస్యం, అలా బయటపడింది.. (వీడియో)

మరిన్ని వార్తలు