Nalgonda : కోమటిరెడ్డి ఫ్లెక్సీ కి పాలాభిషేకం..!

రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం ఆర్యవైశ్యుల మనోభావాలను, ఆత్మగౌరవాన్ని కాపాడుతుతుందని అందులో భాగంగానే మన మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి పట్టణ వైశ్యుల కోరిక మేరకు వైశ్యుల కులదైవం వాసవీ మాత దేవాలయానికి ఎదురుగా ఏర్పాటు చేసిన నాన్ వెజ్ మార్కెట్ ను రద్దుచేసి దాని స్థానం లో పూల మార్కెట్ ఏర్పాటుకు నిర్ణయం తీసుకున్నారని నల్గొండ మునిసిపల్ ఛైర్మన్ అబ్బగోని రమేష్ గౌడ్ అన్నారు.

Nalgonda : కోమటిరెడ్డి ఫ్లెక్సీ కి పాలాభిషేకం..!

ఆర్య వైశ్యుల మనోభావాలు కాపాడుతాం

మునిసిపల్ చైర్మన్ అబ్బగోని రమేష్

నల్గొండ, మన సాక్షి:

రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం ఆర్యవైశ్యుల మనోభావాలను, ఆత్మగౌరవాన్ని కాపాడుతుతుందని అందులో భాగంగానే మన మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి పట్టణ వైశ్యుల కోరిక మేరకు వైశ్యుల కులదైవం వాసవీ మాత దేవాలయానికి ఎదురుగా ఏర్పాటు చేసిన నాన్ వెజ్ మార్కెట్ ను రద్దుచేసి దాని స్థానం లో పూల మార్కెట్ ఏర్పాటుకు నిర్ణయం తీసుకున్నారని నల్గొండ మునిసిపల్ ఛైర్మన్ అబ్బగోని రమేష్ గౌడ్ అన్నారు.

ఆదివారం ఉదయం సీనియర్ జర్నలిస్ట్ కోటగిరి దైవాధీనం ఆధ్వర్యంలో పట్టణ ఆర్యవైశ్యా సంఘం సహకారంతో పలువురు ఆర్యవైష్యులు ఇంటిగ్రేటెడ్ మార్కెట్ యార్డు ఆవరణలో మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఫ్లెక్సీ కి పాలాభిషేకం చేశారు. కార్యక్రమంలో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొని పట్టణ ఆర్యవైశ్యుల సమస్యల పరిష్కారానికి తనవంతు సహాయ సహకారాలు ఎల్లప్పుడు ఉంటాయని హామీ ఇచ్చారు.మంత్రి వెంకటరెడ్డి కి పాలాభిషేకం చేయడం మంచి కార్యక్రమం అని అన్నారు.

ALSO READ : సాగర్ లో ఆగని ఎన్ఎస్పి భూమి కబ్జా..!

సీనియర్ జర్నలిస్ట్ కోటగిరి దైవాధీనం మాట్లాడుతూ మార్కెట్ చుట్టూ వైశ్యుల గృహాలు, మార్కెట్ ఎదురుగా వైశ్యులు కులదైవం వాసవి మాత దేవాలయం ఉన్నప్పటికీ గత పాలకులు తమ ఆకాంక్షలకు విరుద్ధంగా మాంసం మార్కెట్ ను ఏర్పాటు చేశారని ఆవేదన వ్యక్తం చేసారు. అంతేగాక మాంసం మార్కెట్ ను రద్దుచేసి ఆలయ పవిత్రతను కాపాడాలని తామందరం మూకుమ్మడిగా విజ్ఞప్తి చేసినప్పటికీ ఫలితం లేకుండా పోయిందని తెలిపారు .

కానీ పెద్దలు వెంకటరెడ్డి గారు ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీకి అనుగుణంగా తాము గుర్తు చేయనప్పటికి మంత్రి తన మదిలో పెట్టుకుని నేరుగా మార్కెట్ చేరుకుని మాంసం మార్కెట్ ను మార్చి దాని స్థానంలో పూల మార్కెట్ ఏర్పాటు చేయాలని జిల్లా కలెక్టర్ కు అదేశించి వైశ్యుల హృదయాలను గెలుచుకున్నారని తెలిపారు. అందుకుగాను మంత్రి వెంకట్ రెడ్డి చిత్రానికి పాలాభిషేకం చేసి కృతజ్ఞత తెలిపామని అన్నారు.

ALSO READ : కాంగ్రెస్ లో చేరింది అందుకే.. అసలు విషయం బయటపెట్టిన షర్మిల..!

కార్యక్రమంలో మాజీ కౌన్సిలర్ మొరిశెట్టి నాగేశ్వర్ రావు, టీడీపీ అడ్వైసరీ బోర్డ్ మెంబెర్ తేలుకుంట్ల శ్రీనివాస్, ఐ వి ఎఫ్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు పారేపల్లి శ్రీనివాస్, జిల్లా అధ్యక్షుడు రేపాల భద్రాద్రి, కోశాధికారి గోవిందు బాలరాజు,వామ్ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు వందనపు వేణు, అర్థం శ్రీనివాస్ పట్టణ ఆర్యవైశ్య సంఘం అధ్యక్షుడు యామ మురళి, పట్టణ కాంగ్రెస్ మహిళా అధ్యక్షురాలు నాంపల్లి భాగ్య, జిల్లా రేషన్ డీలర్ ల సంఘం అధ్యక్షుడు పారేపల్లి నాగరాజు, ఆలయ కమిటీ ప్రధాన కార్యదర్శి అర్రురు సత్యనారాయణ, నాయకులు నల్గొండ అశోక్,నల్గొండ శ్రీనివాస్, వనమ మనోహర్, వనమ రమేష్, బోనగిరి ప్రభాకర్, అనిల్,ఇమ్మడి వెంకటేశ్వర్లు,నెలంటి కృష్ణయ్య, చంద్ర శేఖర్, చంద్రయ్య, సురేష్, జనార్దన్ తదితరులు పాల్గొన్నారు.. అనంతరం మున్సిపల్ చైర్మన్ అబ్బగోని రమేష్ ను సన్మానించారు.

ALSO READ: మిర్యాలగూడ : అధికార కాంగ్రెస్ పార్టీకి ఎదురు దెబ్బ..!