Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
జిల్లా వార్తలుBreaking Newsతెలంగాణనల్గొండ

Nalgonda : తెలంగాణ విద్యావ్యవస్థ దశ దిశను మార్చుదాం..!

Nalgonda : తెలంగాణ విద్యావ్యవస్థ దశ దిశను మార్చుదాం..!

నల్లగొండ, మన సాక్షి.

తెలంగాణ విద్యావ్యవస్థ దశ దిశను మార్చడానికి చేయి చేయి కలపాలని తెలంగాణ విద్యా కమీషన్ ఛైర్మెన్ ఆకునూరి మురళి పిలుపునిచ్చారు. మంగళవారం నాగార్జున ప్రభుత్వ కళాశాలలో తెలంగాణ విద్యా తీరుతెన్నులపై అధ్యాపకుల నుంచి అభిప్రాయ సేకరణ చేశారు.

ఈ సందర్బంగా ప్రాథమిక, ఉన్నత, కళాశాల విద్య ప్రమాణాలపై అధ్యాపకుల అభిప్రాయాన్ని అడిగి తెలుసుకున్నారు. వార్షిక పరీక్ష విధానం కంటే సెమిస్టర్ విధానం వల్ల విద్యార్థుల్లో విద్యా ప్రమాణాలు మెరుగుపడుతాయని అన్నారు. రానున్న రోజుల్లో అన్ని అటానామస్ కళాశాలలు విశ్వావిద్యాలయాలుగా మారనున్నాయని తెలిపారు.

అధ్యాపకులు డా. వెల్దండి శ్రీధర్ విద్యార్థుల తెలుగు భాషా స్థాయి గురించి చెప్తూ తెలంగాణాలో విద్యార్థుల శ్రవణ, భాషణ, పఠన, లేఖన, నైపుణ్యాల స్థాయిని వివరించారు. సుధాకర్, నాగరాజు, వెంకట్ రెడ్డి, అనిల్, శంకర్ పలు సలహాలు, సూచనలు ఇచ్చారు.

కార్యక్రమంలో తెలంగాణ విద్యా కమీషన్ సభ్యులు, ప్రొఫెసర్ పి. యల్. విశ్వేశ్వర్ రావు, చారకొండ వెంకటేష్, జ్యోత్స్న శివ రెడ్డి, ప్రిన్సిపాల్ డా. ఎస్. ఉపేందర్, అధ్యాపకులు పాల్గొన్నారు.

MOST READ : 

మరిన్ని వార్తలు