Telangana : తెలంగాణ భవన్ లో ఉగాది పంచాంగ శ్రవణం..!

తెలంగాణ భవన్ లో మంగళవారం ఉగాది పంచాంగ శ్రవణం నిర్వహించారు.

Telangana : తెలంగాణ భవన్ లో ఉగాది పంచాంగ శ్రవణం..!

హైదరాబాద్, మన సాక్షి :

తెలంగాణ భవన్ లో మంగళవారం ఉగాది పంచాంగ శ్రవణం నిర్వహించారు. ఉగాది పంచాంగ శ్రవణంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, పార్టీ సీనియర్ నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ..

భారతదేశంలోనే కాకుండా ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్క తెలుగు సోదర, సోదరీమణులందరికీ శ్రీ క్రోధి నామ సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు.

ఈ సంవత్సరం ప్రతి ఒక్కరు శాంతి సామరస్యంతో ఉండాలని, మత కల్లోలాలు లేకుండా సమాజం కొనసాగాలి అని కోరుకుంటున్నట్లు తెలిపారు.

ప్రతి ఒక్కరికీ ఆరోగ్యం, సుఖ సంపదలు కలగాలని, ఈ సంవత్సరం వ్యవసాయ రంగం బాగుండాలని, వర్షాలు బాగా పడాలని కోరుకుంటున్నాను అని కేటీఆర్ అన్నారు.

ALSO READ :