Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
Breaking Newsక్రైంఖమ్మం జిల్లాజిల్లా వార్తలుతెలంగాణ

BREAKING: వివాహిత అనుమానాస్పద స్థితిలో మృతి.. పోలీస్ స్టేషన్ ఎదుట బంధువుల ఆందోళన..!

BREAKING: వివాహిత అనుమానాస్పద స్థితిలో మృతి.. పోలీస్ స్టేషన్ ఎదుట బంధువుల ఆందోళన..!

నేలకొండపల్లి, మన సాక్షి:

అదనపు కట్నం కోసం భార్యను భర్త కొట్టి చంపాడని మృతులను బంధువులు ఆరోపిస్తూ ఆందోళన దిగారు. వివరాలు ఎలా ఉన్నాయి. నేలకొండపల్లి పోలీస్ స్టేషన్ ఎదుట విజయ అనే వివాహిత బంధువులు ఆందోళనకు దిగారు. ఆమె మృతి కి తమ అల్లుడు అవినాష్ కారణమని అతనిపై చర్యలు తీసుకోవాలని మృతురాలి బంధువులు కోరుతున్నారు.

ఖమ్మం జిల్లా నేలకొండపల్లి మండలం సదాశివపురం గ్రామానికి చెందిన అవినాష్ కు సూర్యాపేట జిల్లా, మునగాల మండలం లోని తాడ్వాయి కి చెందిన విజయ కు ఎనిమిది సంవత్సరాల క్రితం వివాహం జరిగింది. వారికి ఇద్దరు పిల్లలు ఉన్నారు .అవినాష్ భార్య విజయను అదనపు కట్నం కోసం తరుచూ వేదిస్తుండేవాడని ఆమె కుటుంబ సభ్యులు ఆరోపించారు.

గత రెండు రోజుల క్రితం కూడా తమ కుమార్తె ఫోన్ చేసి భర్త వేధిస్తున్నాడని చెప్పిందన్నారు. ఇంతలోనే తమ కుమార్తె ను అల్లుడు కొట్టి చంపి ఆసుపత్రికి తీసుకొచ్చాడని వారు ఆవేదన వ్యక్తంచేశారు. అదనపు కట్నం తీసుకురాలేదనే తమ కుమార్తె విజయను అల్లుడు అవినాష్ హత్య చేశాడని మృతురాలి బంధువులు స్టేషన్ ఎదుట ఆందోళనకు దిగారు.

విజయను హత్య చేసిన అవినాష్ పై కఠిన చర్యలు తీసుకొని తమకు న్యాయం చేయాలని మృతురాలి బంధువులు కోరుతున్నారు. నేలకొండపల్లి ప్రభుత్వ ఆసుపత్రి వద్ద ఉద్రిక్తత పరిస్థితులు చోటు చేసుకున్నాయి. మృతురాలి బంధువుల పిర్యాదు పై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహం నేలకొండపల్లి ప్రభుత్వ ఆసుపత్రిలో పోస్టుమార్టం నిర్వహించారు.

ALSO READ :

BIG BREAKING: ఉమ్మడి నల్గొండ జిల్లా డిసిసిబి చైర్మన్ పై నెగ్గిన అవిశ్వాసం.. అనుకూలంగా 15 మంది డైరెక్టర్లు..!

TGSRTC : ఆర్టీసీ ప్రయాణికులకు గుడ్ న్యూస్.. ఇకపై ఆ సమస్య ఉండదు..!

మరిన్ని వార్తలు