Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
Breaking Newsఉద్యోగంజిల్లా వార్తలుతెలంగాణనల్గొండ

Miryalaguda | ప్రభుత్వ ఉద్యోగుల పాలిట శాపంగా సిపిఎస్ విధానం.!

Miryalaguda | ప్రభుత్వ ఉద్యోగుల పాలిట శాపంగా సిపిఎస్ విధానం.!

మిర్యాలగూడ, జూలై 18 , మనసాక్షి :

లక్షా డెబ్బై రెండు వేల సి.పి.ఎస్ ఉద్యోగ కుటుంబాల ఆకాంక్ష పాత పెన్షన్ సాధనకై తెలంగాణ రాష్ట్ర సి.పి.ఎస్ ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 33 జిల్లాల్లో కొనసాగుతున్న పాత పెన్షన్ సాధనా సంకల్పరధ యాత్ర సోమవారం మిర్యాలగూడ చేరుకుంది .

 

16 తేదీ జోగులాంబ గద్వాల జిల్లా ఆలంపూర్ నుండి ప్రారంభంమై వనపర్తి, నాగర్ కర్నూల్, కల్వకుర్తి , నల్గొండ లో దిగ్విజయంగా పూర్తి చేసుకుని మంగళవారం ఉదయం మిర్యాలగూడ చేరింది. సి.పి.ఎస్ విధానం రద్దు చేయాలని కోరుతూ మిర్యాలగూడ డివిజన్ కేంద్రంలో అమరవీరుల స్థూపం నుండి ఆర్డీవో కార్యాలయం వరకు భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు.

 

 

ర్యాలీ అనంతరం ఆర్డీవో కార్యాలయం వద్ద ఏర్పాటు చేసిన సమావేశంలో రాష్ట్ర అధ్యక్షులు గంగాపురం స్థితప్రజ్ఞ మాట్లాడుతూ ప్రభుత్వ ఉద్యోగుల పాలిట శాపంగా మారిన సి.పి.ఎస్ విధానాన్ని రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరించాలన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో 2004 తరువాత నియామకమైన ప్రభుత్వ ఉద్యోగులు ఈ సి.పి.ఎస్ విధానంతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాల సంపూర్ణ మద్దతుతో ఈ పాత పెన్షన్ సాధనా సంకల్ప రధయాత్ర కొనసాగుతుంది అని పాత పెన్షన్ సాధనకై ఉద్యోగ ,ఉపాధ్యాయ సంఘాలన్నీ ఏకతాటిపై రావాలన్నారు.

 

ALSO READ : 

1. CRIME : రెండంతస్తులు చూపించాడు.. రెండున్నర కోట్లకు ముంచాడు..!

2. TSRTC : పల్లె వెలుగు ప్రయాణికులకు తెలంగాణ ఆర్టీసీ బంపర్ ఆఫర్.. బస్సు పాస్ ల అమలుకు నిర్ణయం..!

3. Telangana : తెలంగాణ ఎన్నికలకు ముందే ఐడి కార్డు ఉంటే సరిపోదు.. ఓటర్ల జాబితాలో మీ పేరు.. ఉందో? లేదో? ఇలా చూసుకోండి..!

4. Railway Recruitment : నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. టెన్త్ అర్హతతో 3624 రైల్వే ఉద్యోగాలు..!

5. TSRTC : హైదరాబాద్- తిరుపతి మార్గంలో డైనమిక్ ప్రైసింగ్ విధానం..?

 

 

సి.పిఎస్ విధానం రద్దే ఏకైక ఎజెండాగా తెలంగాణ రాష్ట్ర సి.పి.ఎస్ ఉద్యోగుల సంఘం పోరాడుతుందని. ఆగస్టు 12 న సి.పి.ఎస్ ఉద్యోగుల కుటుంబాలతో హైదరాబాద్ లో సభ నిర్వహిస్తున్నట్లు తెలిపారు.ఈ కార్యక్రమంలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కల్వాల్ శ్రీకాంత్ కోశాధికారి నరేష్ గౌడ్, రాష్ట్ర సంయుక్త కార్యదర్శి నాగవెల్లి ఉపెందర్ , జిల్లా అధ్యక్షులు శిరందాసు రామదాసు, కోశాధికారి అందుగుల విజయ్, మహిళా కన్వీనర్ వల్లపుదాసు భూలక్ష్మి, రాష్ట్ర నాయకులు సురెందర్ సింగ్ , రాంబాబు పంకజ్ రెడ్డి , శ్రీనివాస్ రెడ్డి ,కరోల్ల దేవయ్య, నరెందర్ రావు రోషన్, చంద్రకాంత్ , రాజేష్ తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు