Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
తెలంగాణBreaking Newsజిల్లా వార్తలునల్గొండ

మిర్యాలగూడ : కాలువ పూడ్చి ఆక్రమణ.. రోడ్డుపై నిలిచిన వర్షపు నీరు.. పరిశీలించిన ఎమ్మెల్యే..!

మిర్యాలగూడ : కాలువ పూడ్చి ఆక్రమణ.. రోడ్డుపై నిలిచిన వర్షపు నీరు.. పరిశీలించిన ఎమ్మెల్యే..!

మిర్యాలగూడ టౌన్, మన సాక్షి :

నల్గొండ జిల్లా మిర్యాలగూడ పట్టణంలో వివేకానంద నగర్ కాలనీలో కి వెళ్లే రహదారిపై వర్షపు నీరు భారీగా నిలిచింది. రాకపోకలకు కాలనీవాసులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. రోడ్డు పక్కన ఉన్న కాలువ ఆక్రమణకు గురి కావడంతో వర్షపు నీరు రోడ్డు పైకి చేరింది.

మిర్యాలగూడ పట్టణంలోని 6వ వార్డు వివేకానంద కాలనీలోకి ప్రవేశించే రహదారి పూర్తిగా వర్షపు నీటితో నిండిపోయి కాలనీ వాసులు ఇబ్బందులు పడుతున్నారని ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డికి ఫిర్యాదు చేశారు.

వెంటనే స్పందించిన ఎమ్మెల్యే బిఎల్ఆర్ సోమవారం అధికారులతో కలిసి స్థలాన్ని పరిశీలించారు. స్థానికులు తెలిపిన ప్రకారం… గతంలో అక్కడ పెద్దగా కాలువ ఉండేదని… దాన్ని చిన్నదిగా చేసి పూడ్చడంతో వరద నీరు అధికమై రహదారి పై నిలుస్తున్నాయని తెలియజేశారు.

వెంటనే గతంలో ఏ విధంగా ఉందో అంతే విస్తీర్ణంలో కాలువను నిర్మించాలని అధికారులను ఆదేశించారు. వారి వెంట తహసిల్దార్ హరిబాబు, తదితరులు ఉన్నారు.

LATEST UPDATE : 

Cm Revanth Reddy : తుఫాన్ నష్ట బాధితులకు భారీ సహాయం ప్రకటించిన సీఎం రేవంత్ రెడ్డి..!

Srisailam : శ్రీశైలంకు వరద ఉధృతి.. ఇన్ ఫ్లో 5 లక్షల క్యూసెక్కులు, సాగర్ కు 4 లక్షల క్యూసెక్కులు.. Latest Update

Runamafi : రుణమాఫీ కానీ రైతులకు గుడ్ న్యూస్.. ఇలా చేస్తే ఖాతాలలోకి డబ్బులు..!

Railway : రాత పరీక్ష లేకుండానే రైల్వే జాబ్.. మళ్లీ ఇలాంటి ఛాన్స్ రాదు..!

మరిన్ని వార్తలు