మోడీ పర్యటన సందర్భంగా అరెస్టులు 

మోడీ పర్యటన సందర్భంగా అరెస్టులు 

వెంకటాపురం , మనసాక్షి

ములుగుజిల్లా వెంకటాపురం మండలం.భారత దేశ ప్రధాని నరేంద్ర మోడీ శనివారంనాడు వరంగల్ కు వస్తున్న సందర్భంగా ప్రతిపక్షాలు వివిధ సంఘాల నాయకులను ముందస్తుగా అరెస్టు చేయడం అన్యాయం, అక్రమమని కాంగ్రెస్ నాయకులుచిడెం. మోహన్ రావు,సిపిఐ నాయకులు తోట. మల్లికార్జునరావు అన్నారు.

 

అనంతరంవారు మాట్లాడుతూ. ప్రజాసామ్యంలో ప్రశ్నించే హక్కు ప్రతిపక్షాలకు ప్రజా సంఘాలకు ప్రతి ఒక్క పౌరుడికి ఉందని.ఎన్నికల సమయంలో మీరు ఇచ్చిన హామీలు ప్రతీ కుటుంబానికి15ను లక్లల రూపాయలు బ్యాంకు ఖాతాల్లో ఏస్తామన్న హామీ ఏమైంది. నిరుద్యోగులకు కోటి ఉద్యోగాలమాట ఏమైంది.

 

Also Read :

1. Railway : నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. రైల్వే లో ఖాళీ పోస్టులకు నోటిఫికేషన్..!

2. TSRTC : ఆర్టీసీ ప్రయాణికులకు గుడ్ న్యూస్.. ఇకపై ఆ రూట్లలో 10 శాతం రాయితీ..!

3. Dharani : ధరణి పోర్టల్ పై తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం..!

4. RBI : పర్సనల్ లోన్స్.. క్రెడిట్ కార్డు పై.. ఆర్బిఐ కొత్త నిబంధనలు..!

 

 

రైతును రాజును చేస్తాను వారు పండించిన పంటలకు గిట్టు బాటుధర ఇస్తానన్న హామీ ఏమైందని అన్నీ ప్రవేటుపరం చేయాలని చూసే మిమ్ములను మీప్రబుత్వాన్ని నమ్ముకున్న పేద ప్రజల గురించి ఏనాడైనా ఆలోచించారా.సమస్యలను చెబుదామంటే పోలీసులతో అరెస్టు చేయించడం నీతి మాలిన చర్యని దుయ్యబట్టారు.

 

ఇప్పటికైనా ఆలోచించి మంచినిర్ణయాలు తీసుకోకపోతే రాబోయే ఎన్ని కల్లోప్రజేలే బుద్ధిచెబుతారని అన్నారు.అరెస్ట్ అయిన వారిలో సిపిఐ ములుగు జిల్లా కార్యదర్శి తోట. మల్లికార్జునరావు,సిపిఎం నాయకులు గ్యానం.వాసు, కాంగ్రెస్ నాయకులు చిడెం. మోహనరావు,సిఐటియు నాయకులు కట్ల నరసింహ చారి,ఎమ్మార్పీఎస్, నాయకులు వేల్పుల మల్లేష్, గుగ్గిళ్ళ. నరేందర్,వివిధ సంఘాల నాయకులు ఉన్నారు.