మిర్యాలగూడ : మూసీ నదిలో కొట్టుకుపోతున్న ఐదుగురిని కాపాడిన రెస్క్యూటిమ్..!

మిర్యాలగూడ : మూసీ నదిలో కొట్టుకుపోతున్న ఐదుగురిని కాపాడిన రెస్క్యూటిమ్..!

మిర్యాలగూడ, మనసాక్షి:

రాష్ట్రవ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. వాగులు వంకలు పొంగిపొర్లుతున్నాయి. మూసీనది పరవళ్ళు తొక్కుతుంది . చేపల వేటకు వెళ్లిన మత్స్యకారులు వరద ప్రవాహానికి మూసీ నదిలో కొట్టుకపోతున్న ఐదుగురిని రెస్క్యూ టీం కాపాడిన సంఘటన నల్గొండ జిల్లా మిర్యాలగూడ సమీపంలో చోటుచేసుకుంది.

 

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం దామరచర్ల మండలం తెట్టకుండా గ్రామ సమీపంలో గల మూసీ నదిలో జంగలి రమేష్, బుర్రి నాగేష్ ,జంగలి సైదులు ,గుండెబోయిన వెంకన్న ,ధానావత్ సైదులు చేపల వేట కోసం మూసీ నదిలోకి వెళ్లారు. ఒక్కసారిగా మూసీ నదికి వరదలు రావడంతో వారు నది మధ్యలో చిక్కుకుపోయారు. ప్రాణ భయంతో కేకలు వేయడంతో సమీపంలో ఉన్న వ్యక్తులు వీరిని చూసి స్థానిక పోలీసులకు సమాచారం అందించారు.

 

ALSO READ : 

  1. Viral Video : క్రిష్ లా విద్యార్థి ఫీట్స్.. పాఠశాల బిల్డింగ్ పైనుంచి దూకేశాడు..! (వీడియో వైరల్)
  2.  TSRTC : ప్రైవేట్ ట్రావెల్స్ కు దీటుగా తెలంగాణ ఆర్టీసీ టూర్ ప్యాకేజీ.. 22 నుంచి ప్రారంభం..!
  3. TSRTC : పల్లె వెలుగు ప్రయాణికులకు తెలంగాణ ఆర్టీసీ బంపర్ ఆఫర్.. బస్సు పాస్ ల అమలుకు నిర్ణయం..!
  4. SBI : ఎస్ బీ ఐ కస్టమర్లకు గుడ్ న్యూస్.. హోమ్ లోన్ తీసుకునే వారికి మరింత ఊరట..!

 

విషయం తెలుసుకొని సంఘటనా స్థలానికి చేరుకున్న దామరచర్ల మండలం వాడపల్లి పోలీసులు మిర్యాలగూడ ఫైర్ సిబ్బందికి సమాచారం అందించారు. దాదాపు గంట పాటు శ్రమించి ఐదుగురు వ్యక్తులను సురక్షితంగా ఒడ్డుకు చేర్చారు. ప్రాణాలకు తెగించి బాధ్యతాయుతమైన విధులను నిర్వర్తించిన పోలీసులను పలువురు అభినందించారు.