ఉరేసుకొని వ్యక్తి బలవన్మరణం..!

కుటుంబ కలహాలతో మనస్థాపం చెందిన వ్యక్తి ఉరేసుకొని బలవన్మరణానికి పాల్పడిన ఘటన తుర్కపల్లి గ్రామంలో ఆదివారం జరిగింది.

ఉరేసుకొని వ్యక్తి బలవన్మరణం..!

కనగల్ , మన సాక్షి:

కుటుంబ కలహాలతో మనస్థాపం చెందిన వ్యక్తి ఉరేసుకొని బలవన్మరణానికి పాల్పడిన ఘటన తుర్కపల్లి గ్రామంలో ఆదివారం జరిగింది. కనగల్ ఏఎస్ఐ నర్సిరెడ్డి తెలిపిన వివరాల ప్రకారం… గ్రామానికి చెందిన ఆదిమల్ల శ్రీకాంత్ (27) భార్యాభర్తల మధ్య జరిగిన గొడవతో మనస్థాపం చెంది సాయంత్రం ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఫ్యానుకు ఉరేసుకొని బలవన్మరణానికి పాల్పడ్డాడు.

పనులకు పోయి పొద్దువాలాక ఇంటికొచ్చిన కుటుంబ సభ్యులకు ఇంట్లోని ఫ్యానుకు చీరతో ఉరేసుకొని శ్రీకాంత్ వేలాడుతూ కనిపించాడు. కిందికి దించగా అప్పటికే విగత జీవిగా మారాడు. మృతుని బంధువుల ఫిర్యాదు మేరకు సోమవారం కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఏఎస్ఐ తెలిపారు.

MOST READ :