వలిగొండ : ప్రమాదవశాత్తు బావిలో పడి వ్యక్తి మృతి

వలిగొండ : ప్రమాదవశాత్తు బావిలో పడి వ్యక్తి మృతి

వలిగొండ , మన సాక్షి:

యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండల పరిధిలోని వెల్వర్తి గ్రామానికి చెందిన మీసాల నర్సింహ్మ ( 50) వృత్తిరీత్యా కూలీ పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తూ ఉంటాడు. రోజువారి కూలి పనుల్లో భాగంగా జంగారెడ్డి పల్లి గ్రామంలోని కౌకుంట్ల సత్తిరెడ్డి బావి వద్దకు పనికి వెళ్ళాడు.

 

సుమారు ఆరున్నర గంటలకు పనికి వెళ్లగా ఎనిమిది గంటలకు చనిపోయాడని భార్య లక్ష్మమ్మకు వారు తెలపడం జరిగింది. మీరు భావి వద్దకు చేరుకున్నాక మోటార్ల సహాయంతో బావిలో నీటిని మొత్తం తోడేసి శవాన్ని బయటకు తీశారు.

 

ఈ మరణం ప్రమాదవశాత్తు సంభవించిందా లేదా కరెంటు షాక్ వల్ల మరణించాడా అనేది మాకు అనుమానాస్పదంగా ఉందని భార్య లక్ష్మమ్మ తెలిపింది. ఇట్టి మరణం పై కేసు నమోదు చేసుకొని పోలీసులు దర్యాప్తు చేపట్టామని ఎస్సై పెండ్యాల ప్రభాకర్ తెలిపారు.