Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
జాతీయంBreaking News

Montra Electric : పర్యావరణహిత రవాణాకు బాటలు… మోంట్రా ఎలక్ట్రిక్, గ్రీన్ డ్రైవ్ మొబిలిటీ భాగస్వామ్యం..!

Montra Electric : పర్యావరణహిత రవాణాకు బాటలు… మోంట్రా ఎలక్ట్రిక్, గ్రీన్ డ్రైవ్ మొబిలిటీ భాగస్వామ్యం..!

ఢిల్లీ:

భారత్‌లో పర్యావరణహిత లాజిస్టిక్స్‌ను ప్రోత్సహించే దిశగా డైవర్సిఫైడ్ దిగ్గజం మురుగప్ప గ్రూప్‌లో భాగమైన క్లీన్ మొబిలిటీ బ్రాండ్ ‘మోంట్రా ఎలక్ట్రిక్’ సంస్థ గ్రీన్ డ్రైవ్ మొబిలిటీతో వ్యూహాత్మక ఒప్పందం కుదుర్చుకుంది. ఫస్ట్-మైల్, మిడ్-మైల్, లాస్ట్-మైల్ డెలివరీ సెగ్మెంట్ల వ్యాప్తంగా పర్యావరణహిత రవాణా విధానాల వైపు మార్పుకు సారథ్యం వహించడం ద్వారా సున్నా ఉద్గారాలు వెలువరించే, కర్బన రహిత మొబిలిటీ సొల్యూషన్స్ అందించడమే ఈ భాగస్వామ్య లక్ష్యం.

ఈ ఒప్పందం ప్రకారం, మోంట్రా ఎలక్ట్రిక్ వచ్చే మూడు నెలల్లో 50 EVIATOR ఎలక్ట్రిక్ స్మాల్ కమర్షియల్ వాహనాలను (ఈ-ఎస్‌సీవీ) వినియోగంలోకి తెస్తుంది. వివిధ పరిశ్రమల అవసరాలకు అనుగుణంగా గ్రీన్ డ్రైవ్ విస్తరణకు ఇది తోడ్పడుతుంది. టివోల్ట్ (TIVOLT) ఎలక్ట్రిక్ ప్రైవేట్ లిమిటెడ్ (మోంట్రా ఎలక్ట్రిక్‌లో ఈ-ఎస్‌సీవీ విభాగం) చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ సజు నాయర్, గ్రీన్ డ్రైవ్ మొబిలిటీ ఫౌండర్, సీఈఓ హరి కృష్ణ ఈ వ్యూహాత్మక ఒప్పందంపై సంతకాలు చేశారు.

ఈ విభాగంలోనే అత్యుత్తమ స్పెసిఫికేషన్స్, పనితీరు సామర్థ్యాలు, టెలీమ్యాటిక్స్ సొల్యూషన్స్‌తో అధునాతన సాఫ్ట్‌వేర్ ఆధారిత వాహనంగా EVIATOR నిలుస్తుంది. అత్యధిక లోడ్-క్యారీయింగ్ సామర్థ్యాలు, స్మార్ట్ టెక్ ఫీచర్లు, ఎనర్జీ ఆదా సామర్థ్యాలకు EVIATOR పేరు పొందింది. భారత్‌లో కర్బన రహిత, సున్నా ఉద్గారాల లాజిస్టిక్స్‌ను సుసాధ్యం చేయాలన్న గ్రీన్ డ్రైవ్ లక్ష్యానికి ఇది అనుగుణంగా ఉంటుంది.

తొలి 50 వాహనాల ఫ్లీట్‌ను దశలవారీగా వినియోగంలోకి తేనున్నారు. దీనితో రియల్-టైమ్ ట్రాకింగ్, స్మార్ట్ రూట్ ప్లానింగ్, ఏఐ-ఆధారిత పనితీరు అనలిటిక్స్ వంటి ప్రత్యేకతలు గల గ్రీన్ డ్రైవ్ టెక్ ఆధారిత ఫ్లీట్ నిర్వహణ వ్యవస్థ మరింత పటిష్టమవుతుంది.

ప్రత్యేకతలివే…

“గ్రీన్ డ్రైవ్ మొబిలిటీతో చేతులు కలపడం మాకు చాలా సంతోషకరమైన విషయం. పరివర్తన బాటలో ఉన్న భారత లాజిస్టిక్స్ వ్యవస్థ వ్యాప్తంగా స్వచ్ఛ మొబిలిటీ సొల్యూషన్స్ వినియోగాన్ని వేగవంతం చేసే దిశగా గ్రీన్ డ్రైవ్‌తో భాగస్వామ్యం కీలక ముందడుగు. అధునాతన ఎలక్ట్రిక్ పవర్‌ట్రెయిన్, అబ్బురపరిచే రేంజ్‌నిచ్చే విధంగా, వివిధ విభాగాల వ్యాప్తంగా ఆధునిక రవాణా అవసరాలకు అనుగుణంగా EVIATOR తీర్చిదిద్దారు.

తటస్థ కర్బన ఉద్గారాల భవిష్యత్తుకు సంబంధించి ఉమ్మడి లక్ష్యాలను సాకారం చేసుకునే క్రమంలో గ్రీన్ డ్రైవ్ వృద్ధి ప్రస్థానంలో పాలుపంచుకోవడం మాకు సంతోషకరమైన విషయం” అని సజు నాయర్ తెలిపారు. “ఈఎస్‌జీ ఆధారిత సంస్థలకు పర్యావరణహితమైన, సమర్ధవంతమైన లాస్ట్-మైల్ డెలివరీ సొల్యూషన్స్ అందించడం గ్రీన్ డ్రైవ్ మొబిలిటీ లక్ష్యం.

మోంట్రా ఎలక్ట్రిక్ EVIATORను మా ఫ్లీట్‌కు అనుసంధానించడమనేది అందులో భాగమే. డ్రైవర్‌కు గరిష్ట సౌకర్యం కలిగిస్తూనే, అసాధారణ రేంజ్, భారీ లోడ్-క్యారీయింగ్ సామర్థ్యాలు, అత్యుత్తమ పవర్, టార్క్‌లాంటివి EVIATOR ప్రత్యేకతలు. మా ఫ్లీట్ పనితీరును క్రమబద్ధీకరించుకునేందుకు తోడ్పడేలా, అధునాతన టెలీమ్యాటిక్స్‌తో ఇది మాకు రియల్-టైమ్ నిర్వహణ విశ్లేషణలను అందిస్తుంది.

విశ్వసనీయమైన చార్జింగ్ మౌలిక సదుపాయాలు, మోంట్రా ఎలక్ట్రిక్ టీం ద్వారా ఆఫ్టర్ సేల్స్ సపోర్ట్ డౌన్‌టైమ్‌ను తగ్గిస్తాయి. వినియోగానికి వాహనం ఎల్లప్పుడూ అందుబాటులో ఉండేందుకు తోడ్పడతాయి. సుస్థిరత, నవకల్పనలు, పనితీరుకు సంబంధించి మా తరహాలోనే నిర్దిష్ట విలువలను పాటించే మోంట్రా ఎలక్ట్రిక్‌తో చేతులు కలపడం మాకు గర్వకారణం. సున్నా ఉద్గారాల లాజిస్టిక్స్ లక్ష్య సాధన దిశగా EVIATOR ఒక విశ్వసనీయమైన, అత్యధికంగా రాణించే అసెట్‌గా ఉపయోగపడగలదు” అని హరి కృష్ణ తెలిపారు.

MOST READ : 

  1. TG News : తెలంగాణ మంత్రి మండలి కీలక తీర్మానం.. బీసీలకు 42% రిజర్వేషన్లు..!

  2. Fish Venkat : ఫిష్ వెంకట్ కు అండగా జెట్టి సినిమా హీరో కృష్ణ మానినేని..!

  3. IT : క్లియర్‌ట్యాక్స్ ఏఐ ఆవిష్కరణ.. తెలుగుతో సహా పలు భాషల్లో ఐటీఆర్ ఫైలింగ్ సులభతరం..! 

  4. భారతదేశపు ఫిలిం మేకర్‌లకు సాధికారత.. అకాడెమీని ఆవిష్కరించిన స్క్రీన్..!

  5. Croma : క్రోమా బ్యాక్ టు క్యాంపస్ సేల్.. ల్యాప్‌టాప్‌లు రూ.28,990..!

మరిన్ని వార్తలు