నల్లగొండ : ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవం

నల్లగొండ : ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవం

నల్లగొండ, మనసాక్షి :

ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవం సందర్భంగా జిల్లా ఫోటో జర్నలిస్టులు జిల్లా కలెక్టర్ క్యాంప్ కార్యాలయంలో, జిల్లా పోలీస్ కార్యాలయంలో ఫోటోగ్రఫీ దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. జిల్లా కలెక్టర్ ఆర్ వి. కర్ణన్, జిల్లా ఎస్పీ అపూర్వరావు, ఫోటో జర్నలిస్టులు కలిసి కేక్ కట్ చేశారు. అనంతరం జిల్లాలో ఫోటో జర్నలిస్టుగా పనిచేస్తున్న సీనియర్ ఫోటో జర్నలిస్టులను సన్మానించారు.

 

ఈ సందర్భంగా కలెక్టర్, ఎస్పీ మాట్లాడుతూ ఒక ఫోటోవెయ్యి పదాల సారాంశాన్ని తెలుపుతుందని,ఫోటో జర్నలిస్టులు ప్రభుత్వానికి ప్రజలకు మధ్య వారధిగా ఉంటూ తమ కెమెరాల ద్వారా సమస్యలను ప్రతిబింబించే ఫోటోలను ప్రచురించి సమస్యలను వెలుగులోకి తీసుకొస్తారని కొనియాడారు. ఎంతో విలువైన అందాలను ఎప్పటికీ నిలిచిపోయే విధంగా భద్రపరిచేదే ఫోటోగ్రఫీ అని అన్నారు.

 

MOST READ : 

  1. BRS : బిఆర్ఎస్ లో మొదలైన టికెట్ల లొల్లి
  2. Syber Crime : సైబర్ నేరస్తుల డీప్ ఫేక్ మాయాజాలం.. ఫోటోలు, వీడియోలు గొంతును క్షణాల్లో మార్చేస్తారు..! ఇలా జాగ్రత్తలు పాటించాలి..!
  3. TSRTC : ఒక్క క్లిక్ తో.. మీరు ప్రయాణించాల్సిన బస్సు ఎక్కడుందో తెలుసుకోవచ్చు.. అది ఎలానో చూద్దాం..!
  4. మిర్యాలగూడ : ఎడమ కాలువకు నీటిని విడుదల చేయాలి

 

మొబైల్ ఫోన్లు వచ్చాక ప్రతి నిత్యం తమ ఫోన్లో లో సెల్ఫీలు దిగి గత స్మృతులను గుర్తు చేసుకునే విధంగా ఫోటోలను భద్రపరుస్తున్నారని అన్నారు.

 

ఈ కార్యక్రమంలో ఫోటో జర్నలిస్టులు కంది భజరంగ్ ప్రసాద్, కంది శ్రీనివాస్ ప్రసాద్, కన్నబోయిన కనకయ్య, కొల్లోజు భవాని ప్రసాద్, చిలుములనరేందర్, కారింగు శ్రీనివాస్, యశ్వంత్, రామలింగం, మధు తదితరులు పాల్గొన్నారు