నగరం స్టేజ్ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం

 ప్రమాదంలో మహిళ మృతి

నగరం స్టేజ్ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం

 ప్రమాదంలో మహిళ మృతి

దుబ్బాక, మనసాక్షి :

రోడ్డు ప్రమాదంలో మహిళ అక్కడికక్కడే మృతి చెందిన సంఘటన చోటుచేసుకుంది. అక్బర్ పేట భూంపల్లి మండలం నగరం బస్టాండ్ సమీపంలో జాతీయ రహదారి పై గురువారం జరిగింది. వివరాలిలా ఉన్నాయి పోతారెడ్డిపేట వైపు నుండి భూంపల్లి వైపు వెళుతున్న క్రమంలో ద్విచక్ర వాహనాన్ని వెనుక వైపు నుండి ట్రాక్టర్ ఢీకొట్టడంతో మహిళ అక్కడికక్కడే మృతి చెందింది.

 

ALSO READ : 

  1. మూడేళ్ల కుమారుడు కు విషం ఇచ్చి.. ఆత్మహత్యాయత్నం కు పాల్పడ్డ తల్లి..!
  2. ఆర్థిక ఇబ్బందులతో యువకుడు ఆత్మహత్య..!
  3. మిర్యాలగూడ : విద్యుత్ సమస్యలు ఉంటే, ఫోన్ చేస్తే పరిష్కారం.. ఇవిగో ఫోన్ నెంబర్స్..!
  4. Srisailam : శ్రీశైలం జలాశయానికి పెరిగిన వరద.. విద్యుత్ ఉత్పత్తితో దిగువకు నీరు..!
  5. వామ్మో మామూలు భార్య కాదు ఆమె : భర్త నల్లగా ఉన్నాడని వేధింపులు.. కోర్టు ఏం చెప్పిందంటే..!

 

తిప్పన గుల్ల గ్రామానికి చెందినవారని అన్నారు. తిప్పనగుల్ల గ్రామం నుండి కుటుంబ సభ్యులతో ద్విచక్రవాహనంపై దుబ్బాక ఆకారం గ్రామంలో బంధువుల ఇంట్లో దశదిన కర్మ కార్యక్రమానికి వెళుతుండగా ఈ సంఘటన జరిగింది. తోటమీది రజిత(36) అక్కడికక్కడే మృతి చెందగా.భర్త స్వామి(40) కి స్వల్ప గాయాలయ్యాయి.

 

వీరికి ఒక కూతురు కుమారుడు ఉన్నారు.కూతురు చందన (03),కుమారుడు రాహుల్ (15) ఉన్నారు. సంఘటన స్థలానికి పోలీసులు చేరుకొని మృతదేహాన్ని పోస్టుమార్టం కై దుబ్బాక ప్రభుత్వాసుపత్రికి తరలించారు. సంఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.