తెలంగాణBreaking Newsరాజకీయంసూర్యాపేట జిల్లా

Suryapet : గులాబి కోట.. సూర్యాపేట..!

Suryapet : గులాబి కోట.. సూర్యాపేట..!

మన సాక్షి, సూర్యాపేట :

సూర్యాపేట జిల్లా కేంద్రం గురువారం గులాబి కోటగా మారింది. బీఆర్ఎస్ రజతోత్సవాలు ఉత్సాహంగా నిర్వహించారు. అందులో భాగంగా ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ సూర్యాపేటలో రజతోత్సవాలలో పాల్గొన్నారు. అనంతరం సూర్యాపేట పట్టణంలో నిర్వహించిన భారీ ర్యాలీకి పట్టణమంతా గులాబీ మాయమైంది.

అనంతరం నిర్వహించిన బహిరంగ సభలో కేటీఆర్ మాట్లాడుతూ గులాబీ కార్యకర్తలను ఉత్తేజపరిచారు. కాంగ్రెస్ పార్టీ, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పై విమర్శల వర్షం గుప్పించారు. కేటీఆర్ మాట్లాడుతుండగా సభకు హాజరైన కార్యకర్తల నుంచి హర్షద్వానాలు వినిపించాయి.

కార్యక్రమానికి మాజీ మంత్రి సూర్యాపేట ఎమ్మెల్యే గుంతకండ్ల జగదీశ్ రెడ్డి అధ్యక్షత వహించగా రాజ్యసభ సభ్యులు బడుగుల లింగయ్య యాదవ్ తో పాటు సూర్యాపేట జిల్లా నలుమూలల నుంచి కార్యకర్తలు భారీగా తరలివచ్చారు.

సూర్యాపేట ర్యాలీలో పాల్గొన్న కేటీఆర్

MOST READ : 

  1. Telangana Budget 2025 : తెలంగాణ బడ్జెట్ లో సామాన్యులకు భారీ గుడ్ న్యూస్..!

  2. TG News : మహిళలకు తులం బంగారం.. నెలకు రూ.2500లపై బిగ్ అప్డేట్..!

  3. TG News : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం.. రేషన్ కార్డుదారులకు శుభవార్త..! 

  4. Suryapet : సూర్యాపేట జిల్లాలో అధికారుల నిర్వాకం.. బతికుండగానే అధికారులే చంపేశారు..!

మరిన్ని వార్తలు