Khammam : ఖమ్మం డివిజన్ లో 21 సమస్మాత్మక గ్రామాలు..!

పార్లమెంట్ ఎన్నికలలో సమస్యాత్మాక గ్రామాలలో ప్రత్యేక దృష్టి సారించినట్లు ఖమ్మం రూరల్ ఏసీపీ బీ.తిరపతిరెడ్డి తెలిపారు. నేలకొండపల్లి పోలీస్ స్టేషన్ ను గురువారం ఆకస్మికంగా తనీఖీ చేశారు. పలు రికార్డులను పరిశీలించారు.

Khammam : ఖమ్మం డివిజన్ లో 21 సమస్మాత్మక గ్రామాలు..!

సమస్యత్మాక గ్రామాలలో ప్రత్యేక దృష్టి

ప్రతీ ఒక్కరూ నిర్భయంగా ఓటు హక్కు ను వినియోగించుకోండి

ఖమ్మం రూరల్ ఏసీపీ బీ.తిరపతిరెడ్డి

నేలకొండపల్లి, మన సాక్షి:

పార్లమెంట్ ఎన్నికలలో సమస్యాత్మాక గ్రామాలలో ప్రత్యేక దృష్టి సారించినట్లు ఖమ్మం రూరల్ ఏసీపీ బీ.తిరపతిరెడ్డి తెలిపారు. నేలకొండపల్లి పోలీస్ స్టేషన్ ను గురువారం ఆకస్మికంగా తనీఖీ చేశారు. పలు రికార్డులను పరిశీలించారు. పలు కేసులకు సంబంధించి వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా స్టేషన్ లో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు….ఖమ్మం డివిజన్ లో 21 సమస్మాత్మక గ్రామాలను గుర్తించినట్లు పేర్కోన్నారు.

అన్ని గ్రామాలలో పోలీస్ మార్చ్ నిర్వహించినట్లు తెలిపారు. ప్రతీ ఒక్కరూ నిర్భయంగా ఓటు హక్కు ను వినియోగించుకోవాలని సూచించారు. ఎన్నికల సంఘం -పోలింగ్ సమయం ను అదనంగా మరో గంట సాయంత్రం ఆరు గంటల పోలింగ్ సమయం ను అదనంగా మరో గంట సాయంత్రం ఆరు గంటల వరకు పోలింగ్ నిర్వహిస్తారని తెలిపారు. కావున ఓటర్లు గమనించాలని కోరారు.

ALSO READ : 

డివిజన్ వ్యాప్తంగా 190 లోకేషన్స్, 290 పోలింగ్ కేంద్రాలను ఉన్నట్లు తెలిపారు. అన్ని పోలింగ్ కేంద్రాల వారీగా పోలీసులను కట్టుదిట్టమైన భద్రత ను ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. పోలింగ్ కేంద్రం రోజున 200 మీటర్ల దూరంలో ఉండాలని సూచించారు. కాదని ముందుకు వస్తే చర్యలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరించారు.

పోలింగ్ కేంద్రాల్లోకి సెల్పోన్ ను తీసుకపోవద్దని సూచించారు. ఖమ్మం డివిజన్ లో ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు నిర్వహించేందుకు ప్రతీ ఒక్కరూసహకరించాలని కోరారు. ఆయన వెంట నేలకొండపల్లి ఎస్సై తోట నాగరాజు, ఏఎస్సై కె.కోడేత్రాచు ఉన్నారు.

ALSO READ :