Ys Sharmila : నవసందేహాల పేరుతో సీఎం జగన్ కి మరో సంచలన లేఖ రాసిన వైఎస్ షర్మిలా రెడ్డి..!

"నవ సందేహాల"తో సీఎం జగన్ మోహన్ రెడ్డికి ఎపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిలా రెడ్డి.. మరో లేఖ రాశారు.

Ys Sharmila : నవసందేహాల పేరుతో సీఎం జగన్ కి మరో సంచలన లేఖ రాసిన వైఎస్ షర్మిలా రెడ్డి..!

విజయవాడ, మన సాక్షి:

“నవ సందేహాల”తో సీఎం జగన్ మోహన్ రెడ్డికి ఎపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిలా రెడ్డి.. మరో లేఖ రాశారు.

రాష్ట్రంలో ఉద్యోగాల విషయంలో తాము అడుగుతున్న నవ సందేహాలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.

లేఖలోని సందేహాలు..

1) ప్రభుత్వంలో వచ్చాక 2.30లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామని చెప్పారు..ఏమయింది ? ఏయే శాఖల్లో ఎన్ని ఉద్యోగాలు భర్తీ చేశారు ?

2) జనవరి 1 న ప్రతి ఏడాది జాబ్ క్యాలెండర్ అన్నారు..ఎందుకు ఇవ్వలేదు ?

3) 25 ఎంపీలు ఇస్తే కేంద్రం మెడలు వంచి ప్రత్యేక హోదా తెస్తాం అన్నారు..22 ఎంపీలు ఇస్తే ఏం చేశారు ?

4) గ్రూప్ 2 నోటిఫికేషన్ రెండు సార్లు ఇచ్చి ఒక్క ఉద్యోగం కూడా భర్తీ చేయలేదు..ఎందుకు ?

5) విశ్వవిద్యాలయాల్లో ప్రొఫెసర్లు,అసిస్టెన్స్ ప్రొఫెసర్లు ఎందుకు భర్తీ చేయలేదు ?

6) 23 వేలతో మెగా డీఎస్సీ అని చెప్పి 6 వేలతో దగా డీఎస్సీ ఎందుకు వేశారు ?

7) రాష్ట్రంలో నిరుద్యోగులు 7.7శాతం పెరిగారు అంటే అది మీ వైఫల్యం కాదా ?

8) ఉద్యోగాలు లేక బిడ్డలు ఇతర రాష్ట్రాలకు వలసలు ఎందుకు పోతున్నారు ?

9) జాబు రావాలి అంటే బాబు పోవాలి అన్నారు…ఇప్పుడు జాబు రావాలి అంటే మీ పాలన పోవాలి అంటే అంగీకరిస్తారా ? స్కిల్ డెవలమెంట్ ట్రైనింగ్ సెంటర్లను ఎందుకు నిలిపివేశారు ?

ALSO READ : 

Telangana : తెలంగాణ ప్రయోజనాల కోసం తెగించి కొట్లాడేది కేసీఆర్..!

Climbing Stairs : మీరు ప్రతిరోజు మెట్లు ఎక్కి దిగుతున్నారా..? అయితే ఇది తెలుసుకోవాల్సిందే.. కొత్త అధ్యాయంలో నిజాలు..!

Telangana : తెలంగాణ మహిళలకు సర్కార్ శుభవార్త.. ఏకంగా లక్ష రూపాయలు..!

Bjp : తెలంగాణలో డబుల్ ఆర్ ట్యాక్స్ వసూలు చేస్తున్నారు.. ప్రధాని నరేంద్ర మోడీ