Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
Breaking Newsఉద్యోగంజిల్లా వార్తలుతెలంగాణసూర్యాపేట జిల్లా

Suryapet : పోటీ పరీక్షలలో విజయం కోసం విద్యార్థుల కష్టపడి చదవాలి.. ట్రైనీ ఎస్పి రాజేష్ మీనా..!

Suryapet : పోటీ పరీక్షలలో విజయం కోసం విద్యార్థుల కష్టపడి చదవాలి.. ట్రైనీ ఎస్పి రాజేష్ మీనా..!

సూర్యాపేట, మనసాక్షి :

జీవితంలో ఉన్నత స్ధాయికి చేరుకోవడానికి పాఠశాల స్ధాయిలోనే విద్యార్థులు కష్టపడి చదవాలని ట్రైనీ ఎస్పీ రాజేష్ మీనా ఐపిఎస్ అన్నారు. ఉపాధ్యాయుల శిక్షణ, తల్లిదండ్రుల సహకారంతో నిరంతర శ్రమతో విద్యార్థులు జాతీయ స్ధాయి పోటీ పరీక్షలలో విజయం సాధించవచ్చని అన్నారు. జయ స్కూల్ నందు నిర్వహించిన సృష్టి 2024 సైన్స్ ఎగ్జిబిషన్ నందు ఆయన ముఖ్య అతిధిగా పాల్గొన్నారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సూర్యాపేట లో నూతన ఒరవడి సృష్టించి, పోటి పరిక్షలలో విద్యార్థులు విజయం సాధించే విధంగా జయ స్కూల్ యాజమాన్యం, ఉపాధ్యాయులు పనిచేస్తున్నారని వారికి అభినందనలు తెలిపారు. జయ స్కూల్ సృష్టి 2024 సైన్స్ ఎగ్జిబిషన్ అద్బుతంగా వుందని అన్నారు. ఇటువంటి ప్రదర్శనలు విద్యార్థులలో దాగివున్న సృజనాత్మక ను వెలికి తీస్తాయని అన్నారు.

ALSO READ : Telangana : తెలంగాణ మహిళలకు సీఎం రేవంత్ మరో శుభవార్త.. ప్రతినెల రూ.2500 ఎప్పటినుంచంటే..!

ఈ సందర్భంగా స్కూల్ కరస్పాండెంట్ జయ వేణుగోపాల్ మాట్లాడుతూ ప్రతి సంవత్సరం జయ సృష్టి విజ్ఞాన ప్రదర్శనలు నిర్వహిస్తున్నామని, తమ విజయానికి సహకరిస్తున్న విద్యార్థుల తల్లిదండ్రులు, ఉపాధ్యాయులకు ధన్యవాదాలు తెలిపారు. జయ స్ర్రష్టి 2024 లో అయోధ్య రామాలయ నమూనా అందరిని ఆకట్టుకుంది.

ఇస్రో రాకెట్ తయారి, బోనాలు, యాదగిరి గుట్ట దేవాలయం, దయ్యాలు భయపెట్టే డెవిల్ రూం, స్పేస్ రూం , సైన్స్ అండ్ టెక్నాలజీ, సౌర మండలం, గ్రహణాలు ఏర్పడే విధానం, మన సంస్కృతి, పండుగలు, స్మార్ట్ టౌన్ షిప్ ల నిర్మాణం, సోలార్ ఎనర్జీ, సైన్స్ ల్యాబ్ ప్రయోగాలతో పాటు బిపి, సుగర్ పరిక్షలు విద్యార్దులు నిర్వహించిన హెల్త్ క్యాంప్ లు అందరిని ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమంలో జయ స్కూల్ డైరెక్టర్ లు బింగి జ్యోతి, జెల్లా పద్మ, జిల్లా అకడమిక్ మానిటరింగ్ ఆఫీసర్ జనార్దన్, విద్యార్దుల తల్లిదండ్రులు పాల్గొన్నారు.

ALSO READ : Telangana : తెలంగాణలో పేదలకు మరో శుభవార్త.. ఇందిరమ్మ ఇండ్లకు ముహూర్తం ఖరారు..!

మరిన్ని వార్తలు