Suryapet : ఆయిల్ పామ్ క్షేత్ర సందర్శనలో సూర్యాపేట జిల్లా రైతులు..!
ఆయిల్ పామ్ తోటల సాగులో మెలుకువలు తెలుసుకొనేందుకు కోదాడ, హుజుర్నగర్ డివిజన్ పరిధిలోని మండలాలకు కు చెందిన పలువురు రైతులు గురువారం భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ని అశ్వారావు పేట కు క్షేత్ర సందర్శనకు వెళ్లారు.

Suryapet : ఆయిల్ పామ్ క్షేత్ర సందర్శనలో సూర్యాపేట జిల్లా రైతులు..!
కోదాడ రూరల్, మనసాక్షి
ఆయిల్ పామ్ తోటల సాగులో మెలుకువలు తెలుసుకొనేందుకు కోదాడ, హుజుర్నగర్ డివిజన్ పరిధిలోని మండలాలకు కు చెందిన పలువురు రైతులు గురువారం భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ని అశ్వారావు పేట కు క్షేత్ర సందర్శనకు వెళ్లారు. ఆయా మండలాల్లో ఆయిల్ పామ్ తోటల సాగు చేయాలనుకునే రైతులు క్షేత్ర సందర్శకు వెళ్లి ఆయిల్ పామ్ సాగుచేస్తున్న రైతులతో ముఖా ముకి చర్చించారు.
ఈసందర్బంగా పంట సాగులో ఉండే కష్టా, నష్టాలు, పంట దిగుబడి, పంటను అమ్ముకునే విధానాన్ని నేరుగా అభ్యుదయ రైతులనుండి తెలుసుకున్నారు.ఈ సందర్బంగా అశ్వరావు పేట లో ఉన్న టీ జి ఆయిల్ ఫెడ్ కు చెందిన ఆయిల్ పామ్ ఫ్యాక్టరిని రైతులు సందర్శించి అక్కడ ఉన్న సిబ్బందిని వివరాలు అడిగి తెలుసుకొన్నారు. అనంతరం వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్ రావు ఆయిల్ పామ్ రైతుల తో నిర్వహించిన ఆత్మీయ సమావేశం లో పాల్గొన్నారు.
ఈ కార్యక్రమం లో ఉద్యాన విస్తరణ అధికారులు రంగు ముత్యంరాజు, ఇస్మాయిల్, వంగూరి అనిల్, రైతులు చక్ర రెడ్డి, గాయం నర్సింహా రెడ్డి, రంగారావు, సుబ్బారావు, డి శ్రీనివాస్ రెడ్డి, లక్ష్మి నారాయణ,జుకూరు రామలింగయ్య, కే వెంకటేశ్వర్ రావు, రఫీ, వీరస్వామి, నర్సింహా రావు, తో పలువురు రైతులు ఉన్నారు.
ఇవి కూడా చదవండి :
- ఎలక్ట్రిక్, గృహాపకారణాలు కొన్నప్పుడు సిలికా జెల్ ప్యాకెట్లు వస్తాయి.. అవి పారేసే ముందు ఒక్క నిమిషం..!
- District Sp : జిల్లా ఎస్పీ కీలక ఆదేశం ఒక్క వాహనం కూడా వదలొద్దు..!
- హైదరాబాద్లోని గ్లెనీగిల్స్ హాస్పిటల్స్లో అధునాతన లేబర్ సూట్ ప్రారంభం
- Karimnagar : ఆపరేషన్ వికటించి మహిళ మృతి.. ఆసుపత్రి ఎదుట బంధువులు ఆందోళన









