అప్పుల బాధ భరించలేక వ్యక్తి ఆత్మహత్య

అప్పుల బాధ భరించలేక వ్యక్తి ఆత్మహత్య

నాగిరెడ్డిపేట్ , మనసాక్షి :

అప్పుల బాధ భరించలేక పురుగుల మందు తాగి వ్యక్తి ఆత్మహత్య చేసుకున్న సంఘటన నాగిరెడ్డిపేట్ మండలంలోని జలాల్ పూర్ గ్రామంలో చోటుచేసుకుంది. స్థానిక ఏఎస్ఐ ఉమేష్ తెలిపిన వివరాల ప్రకారం జలాల్ పూర్ గ్రామానికి చెందిన చిన్న మేడి క్రింది మల్లయ్య (41) అనే వ్యక్తికి భార్య ఇద్దరు కూతుర్లు ఉన్నారు. మొదటి కూతురు వివాహం జరిపించారు.

 

జలాల్ పూర్ గ్రామ శివారులో ఒక ఎకరం పొలం ఉండగా గత మూడు సంవత్సరాల క్రితం బోరుబావి త్రవ్వించాడు. బోరుబావి త్రవ్వించిన సంవత్సరంలోపే ఇల్లు కట్టి, మొదటి కూతురు వివాహం జరిపించగా వీటితో అయిన అప్పులతో బాధను భరించలేక, అప్పులు ఎక్కువ అయ్యాయని తరచూ కుటుంబ సభ్యులకు చెప్పేవాడని,

 

ALSO READ : 

  1. Telangana : సారూ.. ఏవీ..? ఆ.. రూ.10 వేలు..?
  2. Tweet : హలో మేడమ్.. మంత్రి సబిత ఇంద్రారెడ్డికి ట్వీట్ల వెల్లువ.. !
  3. TSRTC : నిరుద్యోగుల గుడ్ న్యూస్ : టిఎస్ ఆర్టీసీలో ఐటిఐ దరఖాస్తులకు ఆహ్వానం..!
  4. Cheater : చీటర్ మూవీ ఫస్ట్ లుక్..! 

 

ఈనెల 18వ తేదీన అప్పుల బాధ భరించలేక అర్ధరాత్రి పురుగుల మందులు తాగి, భార్య పిల్లలు హైదరాబాద్ లో ఉండడంతో, హైదరాబాద్ కు వెళ్లి తాను పురుగుల మందు సేవించానని భార్యకు చెప్పడంతో, మల్లయ్య ను వెంటనే చికిత్స నిమిత్తం హైదరాబాద్ లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు.

 

వైద్యుల సలహా మేరకు మెరుగైన వైద్యం కోసం గాంధీ ఆసుపత్రికి తరలించగా ఆస్పత్రిలో చికిత్స పొందుతూ సోమవారం రాత్రి మృతి చెందినట్లు మల్లయ్య అన్న చిన్న మేడికింది కాశయ్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్లు ఎఎస్ఐ ఉమేష్ తెలిపారు.