Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
Breaking Newsజిల్లా వార్తలుతెలంగాణనల్గొండ

 Telangana journalists : తెలంగాణ జర్నలిస్టుల పక్షపాతి బి అర్ ఎస్ ప్రభుత్వం

 Telangana journalists : తెలంగాణ జర్నలిస్టుల పక్షపాతి బి అర్ ఎస్ ప్రభుత్వం

జర్నలిస్టుల సంక్షేమానికి TUWJ-143 కట్టుబడి ఉంది

జర్నలిస్టు భవనo(TJF)కు స్థలం కేటాయిoపు హర్షనీయం

 TUWJ-143 జిల్లా అధ్యక్షుడు గుoడగోని జయశంకర్ గౌడ్

నల్లగొండ , మనసాక్షి

ముఖ్యమంత్రి కేసీఆర్ నేతృత్వంలోని బి ఆర్ ఎస్ ప్రభుత్వం యావత్ తెలంగాణ జర్నలిస్టుల పక్షపాతిగా వ్యవహరిస్తుందని టియుడబ్ల్యూజే జిల్లా అధ్యక్షుడు గుoడగోని జయశంకర్ గౌడ్ పేర్కొన్నారు. హైదరాబాదులోని ఉప్పల్ బాగాయత్ లో జర్నలిస్టు భవనo నిర్మాణానికి సుమారు రెండు వేల గజాల స్థలాన్ని కేటాయించడం పట్ల TUWJ H143 నల్లగొండ జిల్లా శాఖ ఆధ్వర్యంలో స్థానిక పెద్ద గడియారం కూడలి లో సీఎం కేసీఆర్, ఐటీ మంత్రి కేటీఆర్, మీడియా అకాడమీ చైర్మన్, tuwj రాష్ట్ర అధ్యక్షులు అల్లం నారాయణ ల చిత్ర పటానికి పాలాభిషేక కార్యక్రమం నిర్వహించారు.

 

ఈ సందర్బంగా మాట్లాడుతూ జర్నలిస్టుల సంక్షేమానికి తెలంగాణ ప్రభుత్వం, TUWJ ఉమ్మడిగా నిరంతరం కృషి చేస్తున్నాయని తెలిపారు. రెండు దశాబ్దాల మలి దశ ఉద్యమంలో జర్నలిస్టుల పాత్ర కు గుర్తింపుగా ప్రభుత్వo జర్నలిస్టు భవన్ (TJF) కు స్థలం కేటాయింపు అని అభివర్ణించారు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం సాధన అనంతరం జర్నలిస్టుల సంక్షేమానికి కెసీఆర్ ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తుందన్నారు.

 

జిల్లా వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాలలో జర్నలిస్టులకు ఇళ్ల స్థలాల కేటాయింపు కోసం కసరత్తు ప్రారంభమైందని, అతి త్వరలో అర్హులైన జర్నలిస్టులందరికీ ఇళ్ళ స్థలాల పంపిణీ జరుగుతుందన్నారు. టీయూడబ్ల్యుజే రాష్ట్ర అధ్యక్షుడు అల్లం నారాయణ సార్ నేతృత్వంలో జర్నలిస్టుల సమస్యలను ఎప్పటికప్పుడు ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి పరిష్కరించడంలో పురోగతి సాధించామని, సాధ్యమైనంత తరితగతిన పెండింగ్ సమస్యలు అన్ని పరిష్కారమవుతాయని ధీమా వ్యక్తంచేశారు.

 

ALSO READ : 

  1. PhonePe : ఫోన్ పే గుడ్ న్యూస్.. కేవలం రూ.49 తో రూ. లక్ష..!
  2. UGC : ఆ యూనివర్సిటీలు ఫేక్.. ఆ డిగ్రీలు చెల్లవు..!
  3. Murder : రూ 50 వేల సుపారి, రూ. 5 వేల అడ్వాన్స్.. జంట హత్యలు..!
  4. TS TET NOTIFICATION : తెలంగాణ టెట్ నోటిఫికేషన్ విడుదల..!
  5. Chicken : చికెన్ కిలో రూ.100 మాత్రమే.. గంటలోనే అన్ని షాపుల్లో ఖాళీ..!

 

అనంతరం జర్నలిస్టులoదరూ ముక్తకంఠంతో ప్రభుత్వానికి, TUWJ రాష్ట్ర నాయకత్వానికి కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో సంఘం రాష్ట్ర నాయకులు మామిడి దుర్గాప్రసాద్ యాదవ్, మడూరి నరేందర్, జిల్లా నాయకులు రాతికింది అంజయ్య గౌడ్, అన్నమోజు మధనాచారి, కంది సూర్యనారాయణ, చిన్న పత్రికల సంఘం జిల్లా అధ్యక్షుడు ఎన్నమల్ల రమేశ్ బాబు,

 

నల్లగొండ నియోజకవర్గ అధ్యక్ష, కార్యదర్శులు వంగాల శ్రీనివాస్ రెడ్డి ప్రధాన కార్యదర్శి దండెంపల్లి రవికుమార్, అశోక్, కే. శ్రీనివాస్, ఉబ్బని సైదులు, సోమ చంద్రశేఖర్, జంజిరాల లెనిన్, చింత యాదగిరి, మధు, ముచ్చర్ల శ్రీనివాస్, కత్తుల యశ్వంత్, వెంకన్న, ప్రవీణ్, సందీప్ తదితరులున్నారు.

మరిన్ని వార్తలు